ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఏదో ఒక చిన్న పని పడి అప్పుడప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఇలా బయటికి వెళ్లినప్పుడు ముఖాన్ని ఎంత కవర్ చేసుకున్నప్పటికీ ఎండ కారణంగా ముఖం నల్లగా అయిపోవడం కమీలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎండ కారణంగా స్కిన్ మొత్తం డల్ గా అయిపోయి ఉంటుంది. దానికి తోడు విపరీతమైన చెమట కారణంగా పింపుల్స్ కూడా వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఏవి రాకుండా ఉండాలంటే ఎండకు వెళ్లి వచ్చిన తరువాత తప్పకుండా కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ముఖానికి వేసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పాలలో చర్మానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. పాలని వాడడం వల్ల కూడా చర్మానికి మేలు జరుగుతుందట. దీని కోసం ఐస్ ట్రేలో పచ్చిపాలని వేసి క్యూబ్స్ లా చేయాలట. తర్వాత వీటిని బయటకి వెళ్లి వచ్చాక ఒక్కో మిల్క్ క్యూబ్ తో చర్మంపై రుద్దాలి. దీంతో చర్మానికి చల్లదనం అంది తాజాగా కూడా అనిపిస్తుందట. వీటిని రాత్రి పడుకునే ముందు రుద్ది మరుసటి రోజు ఉదయాన్నే చల్లని నీటితో క్లీన్ చేసుకుంటే చర్మం యవ్వనంగా, తాజాగా మారుతుందని చెబుతున్నారు.
అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో అంతే పరిమాణంలో తేనె కలపాలి పలాలి. దీనిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత దీనిని నీటితో క్లీన్ చేయాలి. నిమ్మ స్కిన్ ని బ్రైట్ గా చేస్తుందట. చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుందట.
అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనెలో చిటికెడు పసుపుపొడి వేబాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాలు అలానే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది చికాకు కలిగించే చర్మాన్ని కాపాడడంలో సహాయపడుతుందట.. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేసి యవ్వనంగా ఉంచుతుందని చెబుతున్నారు. అలాగే స్కిన్ కేర్ లో వాడే ముల్తానీ మట్టితో ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనిని వాడడం వల్ల వేసవి తాపం తగ్గుతుంది.
ఇందుకోసం ముల్తానీ మట్టి ఒక చెంచా, రోజ్ వాటర్ 4 చెంచాల చొప్పున తీసుకుని బాగా కలపాలి. దీనిని ఐస్‌ట్రేలో వేసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇవి క్యూబ్స్‌లా తయారవుతాయి. ఇలా తయారు చేసిన క్యూబ్స్‌ని చర్మంపై మృదువుగా రుద్దాలట. ఆరేవరకూ ఉండనిచ్చి తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో ఎండనుంచి చర్మానికి రిలాక్స్ అవ్వడమే కాకుండా స్కిన్ కూడా మెరుస్తుందట.