Yoga Asanas for Heart: ప్రతీ రోజు కొన్ని రకాల యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అని చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే యోగాసనాలు ఇంట్లో ట్రై చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ యోగాసనాలు ఏవో వాటిని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఎన్నో యోగాసనాలు ఉన్నాయి.
వాటిని క్రమం తప్పకుండా చేస్తే రక్త ప్రవాహం మెరుగుపడి ఒత్తిడి తగ్గి మొత్తం ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుందని చెబుతున్నారు. ఇందులో మొదటిది తడాసనం. దీనినే పర్వత భంగిమ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం వేయడం చాలా తేలిక. ఈ భంగిమ శరీర అమరికను, స్థిరత్వాన్ని ఏర్పరచడానికి సహాయపడుతుందట. కాళ్ల కండరాలను ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుందని, ఇది మొత్తం శారీరక ఆరోగ్యానికి మద్ధతు ఇవ్వడంతో పాటుగా నేరుగా గుండె పనితీరుకు మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. ఉత్కటాసనం.. తొడలు, గ్లూట్స్, కోర్ స్ట్రెంత్ పెంచడంలో ఈ ఆసనం మంచి ఫలితాలను ఇస్తుందని, అలాగే ఇది మిమ్మల్ని స్ట్రాంగ్ గా చేసే ఒక ఆసనం అని చెబుతున్నారు.
ఉత్కటాసనం ఓర్పు, స్థిరత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుందట. ఇది కండరాలను బలోపేతం చేయడం, గుండెపై పనిభారాన్ని తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తుందని శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. వీరభద్రాసనం.. ఈ డైనమిక్ ఆసనం వేయడం వల్ల కాళ్లు, తుంటి, కోర్‌పై ప్రెజర్ పడుతుందట. దీనివల్ల విశ్రాంతి పెరుగుతుందని, బాడీ కూడా బ్యాలెన్స్ అవుతుందని, డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల రక్త ప్రవాహం మెరుగవుతుందని గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఉత్త నాసనం.. ఈఆసనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ భంగిమ దిగువ వీపు, తొడలను స్ట్రెచ్ చేస్తుంది.
దీనివల్ల ఒత్తిడి తగ్గి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా చక్రాసనం శక్తివంతమైన ప్రయోజనాలు అందిస్తుందట. ఇది వెన్నెముకను పటిష్ఠం చేస్తుందని చేతులు, ఛాతీకి బలాన్ని చేకూరుస్తుందని, గుండెకు రక్త ప్రసరణను అందించి ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. కాగా ఈ యోగాసనాలు తరచుగా ప్రాక్టీస్ చేస్తే బాడీకి మంచి ఫ్లెక్సిబులిటీ వస్తుందట. అంతేకాకుండా మెటబాలీజం, రక్తప్రసరణ మెరుగవుతుందట. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు.
Yoga Asanas for Heart: గుండె జబ్బులను దూరం చేసే యోగాసనాలు.. సింపుల్ గా ఇంట్లోనే వేయండిలా!

Yoga Asanas For Heart