Health Benefits Cotton Sheets:కాటన్ బెడ్ షీట్స్ పై నిద్రపోతే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే..

వస్త్రాల్లో రారాజుగా కాటన్ కు పేరుంది. వేడి వాతావరణ పరిస్థితులో ఉండే వారికి కాటన్ దుస్తులు ది బెస్ట్.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 02:28 PM IST

వస్త్రాల్లో రారాజుగా కాటన్ కు పేరుంది. వేడి వాతావరణ పరిస్థితులో ఉండే వారికి కాటన్ దుస్తులు ది బెస్ట్. ఇక బెడ్ షీట్స్ విషయానికి వస్తే.. కాటన్ బెడ్ షీట్స్ మేలైనవి. ఇవి తేలికగా, మృదువుగా ఉంటాయి.కాటన్ బెడ్ షీట్స్ లో థ్రెడ్ కౌంట్ ను బట్టి
144 టీసీ, 210 టీసీ, 300 టీసీ, 400 టీసీ అనే రకాలు ఉంటాయి. థ్రెడ్ అంటే దారపు పోగులు. థ్రెడ్ కౌంట్ పెరిగే కొద్దీ కాటన్ బెడ్ షీట్ క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. కాటన్ లో అత్యంత ప్రీమియం రకం పేరు ఈజిప్షియన్ కాటన్. దీని క్వాలిటీని కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మొచ్చు. కాటన్ బెడ్ షీట్స్ పై నిద్రపోతే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇన్ సోమ్నియాకు చెక్..

మంచి బెడ్ షీట్ పై కంఫర్ట్ గా నిద్రపడుతుంది. ఫలితంగా నిద్ర లేమి సమస్యను మీరు జయించొచ్చు. బాగా నిద్రపోవచ్చు.ప్రశాంతమైన నిద్ర వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యాధులు ముసురుకునే ముప్పు ఉండదు.

* అన్ని స్కిన్ టైప్స్ కు అనుకూలం

అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్లకు అత్యంత అనుకూలంగా కాటన్ బెడ్ షీట్స్ ఉంటాయి. కాటన్ వస్త్రానికి యాంటీ అలర్జిక్ స్వభావం ఉంటుంది. ఫలితంగా చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి మెరుగైన రక్షణ కల్పిస్తుంది. కాటన్ బెడ్ షీట్స్ లో బ్యాక్టీరియా సంతానోత్పత్తి కి అవకాశాలు దాదాపు ఉండవు. కాటన్ బెడ్ షీట్స్ లో తేమ శాతం చాలా తక్కువ. ఫలితంగా అది మీ బెడ్ ను సదా ఫ్రెష్ గా ఉంచుతుంది.

* అధిక తేమను లాగేసి..

భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న దేశాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ. ఎండలు ఎక్కువ. కాటన్ బెడ్ షీట్స్ మిమ్మల్ని మండుటెండల్లోనూ కూల్ గా ఉంచుతాయి. నిద్రపోయే వాళ్ళ శరీరంలో ఉండే అధిక తేమను కూడా కాటన్ బెడ్ షీట్ లాగేసి బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఫలితంగా శరీరం కూల్ గా మారి, బాగా కూల్ గా నిద్రపడుతుంది.

* వేడి పొక్కులు, చెమట పొక్కులు

కాటన్ బెడ్ షీట్స్ ను వాడటం వల్ల చర్మం పై వేడి పొక్కులు రావు. చెమట చర్మం లోనే పేరుకుపోవడం వల్ల వేడి పొక్కులు వస్తుంటాయి. ఏటా ఎండాకాలం లో పిల్లలు, యువతలో చెమట పొక్కుల సమస్య కనిపిస్తుంటుంది. ఇవి నొప్పిగా కూడా ఉంటాయి. మన చర్మం లోనే ఇంకిపోయి ఎండిపోయిన చెమట ను గ్రహించి , దాన్ని కూల్ చేసే పనిని కాటన్ బెడ్ షీట్స్ చేస్తాయి.

* ఎటువైపు అయినా తిప్పొచ్చు..

కాటన్ బెడ్ షీట్స్ ఎంతో కంఫర్ట్ గా ఉంటాయి. వీటిని ఈజీగా ఎటువైపు అయినా తిప్పొచ్చు. ఫలితంగా మనం వీటిపై ఎంతో సౌకర్యంగా నిద్రపోయే ఛాన్స్ ఉంటుంది. సాధ్యమైనన్ని ఎక్కువ గంటల పాటు నిద్రపోవడానికి కాటన్ బెడ్స్ సహకరిస్తాయి.

*-దుమ్ము ధూళి పేరుకుపోదు..

కాటన్ బెడ్ షీట్స్ పై దుమ్ము ధూళి అంత ఈజీగా పేరుకొని పోదు. ప్రత్యేకించి ఆస్తమా రోగులకు కాటన్ బెడ్ షీట్స్ వాడితేనే మంచిది.చాలా చక్కగా, తాపీగా నిద్రపోగలుగుతారు. ఆహ్లాదకరంగా శ్వాస తీసుకుంటూ హాయిగా నిద్రపోయే వాతావరణాన్ని కాటన్ బెడ్ షీట్స్ సృష్టిస్తాయి.

* బ్రెయిన్ , హార్ట్ పై ప్రభావం

బాగా నిద్రపోకపోతే ఆ ప్రభావం మీ బ్రెయిన్ , హార్ట్ పై పడుతుంది. ఈ సమస్య గురించి యాదికి తెచ్చుకుంటే..మీరు తెలివైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. కాటన్ బెడ్ షీట్ పై నిద్రపోయే వాళ్లు పిల్లల్లా ఒకరిని మరొకరు పోటీగా తీసుకొని దీనికి సంబంధించిన చికిత్స పొందుతున్నారు

* వాషింగ్, డ్రయింగ్, ఐరనింగ్ ఈజీ..

కాటన్ బెడ్ షీట్ నిర్వహణ ఈజీ. వీటికి సంబంధించిన వాషింగ్, డ్రయింగ్, ఐరనింగ్ ఎంతో సులభం. కాటన్ బెడ్ షీట్ ను వాషింగ్ మెషీన్ లోనూ ఉతకొచ్చు. మన శరీరం పై ఒత్తిడి ఎక్కువగా పడకుండా కాటన్ బెడ్ షీట్ ప్రొటెక్షన్ ఇస్తుంది.