Site icon HashtagU Telugu

Tomoto Pulao: ఎంతో టేస్టీగా ఉండే టమాటో పులావ్.. ఇంట్లోనే సింపుల్గా ట్రై చేయండిలా!

Mixcollage 18 Mar 2024 04 40 Pm 7987

Mixcollage 18 Mar 2024 04 40 Pm 7987

కూరగాయలలో ఒకటైన టమోటాని మనం ఎన్నో రకాల కూరల్లో ఉపయోగిస్తూ ఉంటాము.. చాలా రకాల వంటకాలు టమోటా లేకుండా పూర్తి కూడా కావు. ప్రత్యేకించి టమోటాతో టమోటా రసం, టమోటా పచ్చడి, టమోటా రైస్ ఇలా పలు రకాల రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటారు. అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే టమోటో పులావ్ రెసిపీని ఎప్పుడైనా ఇంట్లోనే తిన్నారా. తినకపోతే ఈ రెసిపీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

బాస్మతి బియ్యం – రెండు కప్పులు
టమోటా ముక్కలు – ఒక కప్పు
ఉల్లిపాయ – ఒకటి
నెయ్యి – రెండు స్పూనులు
కారం – ఒక స్పూను
పసుపు – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – నాలుగు స్పూన్లు
నూనె – నాలుగు స్పూన్లు
కరివేపాకులు – గుప్పెడు
జీడిపప్పులు – ఎనిమిది
అల్లం తరుగు – ఒక స్పూను
వెల్లుల్లి తరుగు – ఒక స్పూను
పచ్చిమిర్చి – రెండు
గరం మసాలా – ఒక స్పూను

తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా బియ్యం బాగా కడిగి పొడిగా వచ్చేలా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. కాస్త నూనె వేసి వండితే అన్నం పొడిగా వస్తుంది. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. టమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. మూత పెడితే టమాటోలు బాగా మగ్గుతాయి. పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. అన్ని ఉడికాక గరం మసాలా పొడి వేయాలి. అందులో ఒక స్పూను నెయ్యి కూడా వేస్తే మంచి టేస్టు వేస్తుంది. తర్వాత అందులోనే వేయించిన జీడిపప్పులు, కొత్తిమీర తరుగు కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. స్టవ్ కట్టేసి అందులో ఉడికిన అన్నాన్ని వేసి కలపాలి. కలిపేటప్పుడు ముద్దయ్యేలా కాకుండా పొడిపొడిగా కలపాలి. అంతే టమోటా పులావ్ రెడీ.

Exit mobile version