Tomato Red Chilli Pickle: టమాటో పండుమిర్చి నిల్వ పచ్చడి.. సింపుల్ గా ట్రై చేయండిలా?

మామూలుగా మనం ఎప్పుడు తినే వంటకాలు కాకుండా అప్పుడప్పుడు ఏదైనా కొత్తగా తినాలని అనుకుంటూ ఉంటారు. ఎంత వంటకాలు అనగానే చాలామందికి నిల్వ

  • Written By:
  • Updated On - March 5, 2024 / 07:59 PM IST

మామూలుగా మనం ఎప్పుడు తినే వంటకాలు కాకుండా అప్పుడప్పుడు ఏదైనా కొత్తగా తినాలని అనుకుంటూ ఉంటారు. ఎంత వంటకాలు అనగానే చాలామందికి నిల్వ పచ్చడిలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇందులో ఎన్నో రకాల నిల్వ పచ్చళ్ళు ఉన్నాయి. అటువంటి వాటిలో టమోటా పండుమిర్చి నిల్వ పచ్చడి కూడా ఒకటి. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

టమాటోలు – అరకిలో
పండు మిర్చి – అరకిలో
చింత పండు – చిన్న ఉండ
జీలకర్ర – ఒక టీస్పూను
వెల్లుల్లి రెబ్బలు – గుప్పెడు
పసుపు – ఒక టీస్పూను
ఉప్పు – రుచికి సరిపడా
కరివేపాకులు – గుప్పెడు
ఆవాలు – అర టీస్పూను
ఎండు మిర్చి – మూడు
నూనె – అయిదు స్పూన్లు

తయారీ విధానం :

టమాటో ముక్కలను కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. తరువాత నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. మూత పెట్టి బాగా ఉడికించాలి. టమాటోలలోని నీళ్లు మొత్తం దిగి వేగాక, చింతపండు చిన్న ముద్ద వేసి కలపాలి. బాగా ఉడికాక స్టవ్ కట్టేసి చల్లారే వరకు పక్కనే పెట్టాలి. ఇక పండు మిర్చిని కడిగి తడి లేకుండా తుడిచి మిక్సీలో వేయాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి రుబ్బుకోవాలి. అందులో ఉడికించిన టమోటో మిశ్రమాన్ని కూడా వేయాలి. మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టి నూనె వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి. రుబ్బుకున్న పచ్చడిలో ఈ తాళింపును వేయాలి. అంతే టమాటో, పండు మిర్చి పచ్చడి రెడీ అయినట్టే. దీన్ని గాజు సీసాలో వేస్తే ఏడాది పాటూ నిల్వ ఉంటుంది.