Site icon HashtagU Telugu

Tomato Pulao: పిల్లలు ఎంతగానో ఇష్టపడే టమాటో పులావ్ రెసిపీని సింపుల్ గా చేసుకోండిలా?

Mixcollage 27 Dec 2023 06 23 Pm 2094

Mixcollage 27 Dec 2023 06 23 Pm 2094

మామూలుగా టమోటాని మనం అన్ని రకాల కూరల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ప్రత్యేకించి టమోటాలతో టమోటా రసం, టమోటా చట్నీ, టమోటా ఊరగాయ వంటి రెసిపీలో చేసుకుని తింటూ ఉంటాం. అయితే పిల్లలు నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే రెసిపీలలో టమోటో పులావ్ రెసిపీ కూడా ఒకటి. మరి ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా ట్రై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టమాటో పలావ్ కీ కావలసిన పదార్థాలు

బాస్మతీ బియ్యం – నాలుగు కప్పులు
టమాటాలు – ఆరు
ఉల్లిపాయ – ఒకటి
పుదీనా – కొద్దిగా
పచ్చిమిర్చి – నాలుగు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్
నూనె – తగినంత
నెయ్యి – టేబుల్ స్పూన్
ఏలకులు – మూడు
లవంగాలు – కొద్దిగా
దాల్చినచెక్క – చిన్నముక్క
షాజీరా- టీ స్పూన్
ఉప్పు – తగినంత

టమాటో పలావు తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా బియ్యం కడిగి నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. తర్వాత టమాటాలు చిన్న ముక్కలుగా తరిగి, మెత్తగా రుబ్బుకోవాలి. ఒక పాన్‌లో నూనె, నెయ్యి కలిపి వేడిచేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి వేగిన తరువాత పుదీనా, నిలువుగా చీల్చిన పచ్చిమిరప కాయలు వేసి, కొద్దిగా వేపి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా కూడా వేసి మరి కొద్దిసేపు వేయించాలి. టమాటా ముద్దలో బియ్యానికి సరిపడా నీళ్లు కలుపుకుని ఈ పోపులో పోయాలి. అదే నీళ్లలో తగినంత ఉప్పు వేయాలి. టమాటా నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్లలో నానిన బియ్యం వడగట్టివేసి ఉడికించాలి. బియ్యం ఉడికి, నీరంతా ఇరిగిపోయాక మంట పూర్తిగా తగ్గించి, నిదానంగా మరో ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పులావ్ రెడీ..