Tomato Pulao: ఇంట్లోనే ఎంతో టేస్టీగా టొమాటో పులావ్ తయారు చేసుకోండిలా?

మామూలుగా మనం టమాటోతో అనేక రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. టమాటో రైస్, టమాటో పచ్చడి ఇలా అనేక వంటలు చేసుకొని తింటూ

  • Written By:
  • Publish Date - August 31, 2023 / 08:21 PM IST

మామూలుగా మనం టమాటోతో అనేక రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. టమాటో రైస్, టమాటో పచ్చడి ఇలా అనేక వంటలు చేసుకొని తింటూ ఉంటారు. అయితే ఎప్పుడు అయినా టమాటో పులావు తిన్నారా. తినకపోతే టమాటో పులావు ఎలా తయారు చేయాలి. అందుకు ఏఏ పదార్థాలో కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టమాటో పలావుకి కావలసినవి పదార్థాలు :

బాస్మతీ బియ్యం – నాలుగు కప్పులు
టమాటాలు – ఆరు
ఉల్లిపాయ – ఒకటి
పుదీనా – కొద్దిగా
పచ్చిమిర్చి – నాలుగు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్
నూనె – తగినంత
నెయ్యి – టేబుల్ స్పూన్
ఏలకులు – మూడు
లవంగాలు – కొద్దిగా
దాల్చినచెక్క – చిన్నముక్క
షాజీరా- టీ స్పూన్
ఉప్పు – తగినంత

టమాటో పలావు తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. ఇప్పుడు టమాటాలు చిన్న ముక్కలుగా తరిగి, మెత్తగా రుబ్బుకోవాలి. ఒక పాన్‌లో నూనె, నెయ్యి కలిపి వేడిచేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి వేగిన తరువాత పుదీనా, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి, కొద్దిగా వేపి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా కూడా వేసి మరి కొద్దిసేపు వేయించాలి. టమాటా ముద్దలో బియ్యానికి సరిపడా నీళ్లు కలుపుకుని ఈ పోపులో పోయాలి. అదే నీళ్లలో తగినంత ఉప్పు వేయాలి. టమాటా నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్లలో నానిన బియ్యం వడగట్టివేసి ఉడికించాలి. బియ్యం ఉడికి, నీరంతా ఇరిగిపోయాక మంట పూర్తిగా తగ్గించి, నిదానంగా మరో ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పలావు రెడీ.