Tomato Masala Bajji: టమోటా మసాలా బజ్జి ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

సాయంత్రం అయ్యింది అంటే చాలు ఇంట్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒకరు ఏదో ఒక రకమైన స్నాక్స్ తినాలని అనుకుంటూ ఉంటారు. స్నాక్స్ అనగానే

Published By: HashtagU Telugu Desk
Tomato Masala Bajji

Tomato Masala Bajji

సాయంత్రం అయ్యింది అంటే చాలు ఇంట్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒకరు ఏదో ఒక రకమైన స్నాక్స్ తినాలని అనుకుంటూ ఉంటారు. స్నాక్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బజ్జీలు, మైసూర్ బోండాలు.. బజ్జీలలో ఆనియన్ బజ్జీ మిరపకాయ బజ్జీ,ఉర్లగడ్డ బజ్జి, అంటూ రకరకాల బజ్జీలు చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైనా వెరైటీగా టమోటా మసాలా బజ్జి ట్రై చేశారా. ఇప్పుడు తినకపోతే మరి టమోటా మసాలా బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టమోటా మసాలా బజ్జీ కావలసిన పదార్థాలు :

టమోటాలు – 1/2 కేజీ
బంగాళాదుంపలు – 1/2కేజీ
నూనె – సరిపడా
గరం మసాలా – 2 టేబుల్ స్పూన్
కొత్తిమీర – 1కప్
పెసరపప్పు – 4 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు – 3
పచ్చిమిర్చి – 4
శనగపిండి – 1కప్

టమోటా మసాలా బజ్జీ తయారీ విధానం:

ముందుగా టమోటాలను ఒకే సైజుగా ఉండేటట్టు కట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును, బంగాళాదుంపలను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. టమోటాల్లో గుజ్జు, విత్తనాలను తీసేసి పక్కనుంచాలి. ఇప్పుడు ఉడికించిన పప్పు, బంగాళాదుంపల మిశ్రమంలో గరంమసాలా, ఉప్పు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని టమోటాల్లో పెట్టాలి. ఈ టమోటాలను జోరుగా కలిపి ఉంచిన శెనగపిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి కాస్త కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే టమోటా మసాలా బజ్జీ రెడీ. .

  Last Updated: 14 Sep 2023, 05:26 PM IST