Tomato Halwa: ఎంతో టేస్టీగా ఉండే టమాటా హల్వా.. ఇంట్లోనే చేసుకోండి?

ప్రతి ఒక్కరి వంట గదిలో టమోటా తప్పనిసరిగా ఉంటుంది. టమాట లేకుండా చాలా వరకు కూరలు తయారు చేయలేము. టమోటాలతో రసం, పప్పు, చట్నీ, టమోటా కర్రీ

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 08:20 PM IST

ప్రతి ఒక్కరి వంట గదిలో టమోటా తప్పనిసరిగా ఉంటుంది. టమాట లేకుండా చాలా వరకు కూరలు తయారు చేయలేము. టమోటాలతో రసం, పప్పు, చట్నీ, టమోటా కర్రీ, మసాలా కర్రీ అంటూ రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటారు. టమోటాతో ఎక్కువ శాతం కర్రీ లనే చేస్తూ ఉంటారు. కానీ టమోటాతో ఎప్పుడైనా స్వీట్ ఐటమ్ ట్రై చేశారా. వినడానికి కాస్త వెరైటీగా ఉన్నా కూడా ఆ రెసిపీ ఎంతో బాగుంటుంది. మరేదో కాదు టమోటా హల్వా. మరి ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టమాటా హల్వాకి కావలసినవి పదార్ధాలు :

టమాటాలు – ఆరు
నెయ్యి – అరకప్పు
పంచదార – కప్పు
రవ్వ – అర కప్పు
బాదం, జీడిపప్పులు – అర కప్పు
యాలకులు పొడి – టీ స్పూన్

టమాటా హల్వా తయారీ విధానం :

ముందుగా టమాటాలు శుభ్రంగా కడిగి వాటిని ఉడకబెట్టుకోవాలి.తరువాత అందులో ఉన్న నీటిని తీసేసి మిక్సిలో గుజ్జుగా చేసి పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి ఒక బాణలి తీసుకొని అందులో నెయ్యి వేసి అది కాగాక జీడిపప్పులు, బాదం పప్పులు దోరగా వేపి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా వేపి, దానిలో రెండు కప్పుల నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. రవ్వకాస్త గట్టిపడగానే టమాట గుజ్జు, పంచదార వేసి కలపాలి. ఆ మిశ్రమం బాగా చిక్కబడిన తరువాత యాలుకల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, మిగిలిన నెయ్యి వేసి కలిపి ముద్దగా అయ్యిన తరువాత స్టవ్ ఆపాలి. తరువాత ప్లేటుకి నెయ్యిరాసి ఈ మిశ్రమం వేసి సమంగా చేసి మీకు ఏ షేపులో కావాలంటే ఆ షేపులో కట్ చేసుకుంటే తియ తియ్యగా ఉండే టమాట హల్వ రెడీ.