Site icon HashtagU Telugu

Tomato Bath: ఎంతో టేస్టీగా ఉండే టమాట బాత్ రెసిపి సింపుల్ గా టేస్టీగా ట్రై చేసుకోండిలా?

Mixcollage 22 Jan 2024 07 34 Pm 9863

Mixcollage 22 Jan 2024 07 34 Pm 9863

మామూలుగా మనం టమోటాలను చాలా రకాల వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని రకాల వంటకాలు టమోటాలు లేనిదే పూర్తి కూడా కావు. ప్రత్యేకించి టమోటాతో కొన్ని కూరలు కూడా తయారు చేస్తూ ఉంటాం. టమోటా రసం, టమోటా చట్నీ, టమోటా పులావ్, టమోటా కర్రీ లాంటి రెసిపీలు తింటూ ఉంటాము. అయితే టమోటా తో చేసే ఆహార పదార్థాలు ఎక్కువ శాతం మంది ఇష్టపడే రిసిపి టమోటా బాత్. మరి ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావలసిన పదార్దాలు:

బొంబాయి రవ్వ – పావుకేజీ
టమాటాలు – 2
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – మూడు
పల్లీలు – టేబుల్ స్పూన్
ఆవాలు – అర టీ స్పూన్
నెయ్యి – రెండుటేబుల్ స్పూన్లు
కరివేపాకు – సరిపడా
అల్లం ముక్కలు – టీ స్పూన్
శెనగపప్పు – టీ స్పూన్
జీడిపప్పు – పది
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత

తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెపెట్టుకుని రవ్వను వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అందులోనెయ్యి వేసి వేడి అయ్యాక పోపుదినుసులు, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి వేయించాలి. ఇప్పుడు టమాటముక్కలు కలపాలి.కొంచంసేపు వేయించి సరిపడా నీళ్ళు, ఉప్పు వేసి మూతపెట్టాలి. నీళ్ళు మరుగుతుండగా రవ్వవేసి కలపాలి. 5 నిముషాలు ఉడకనివ్వాలి. ఎంతో టెస్ట్ గా ఉండే టమాటా బాత్ రెసిపి రెడీ.