Honey – Heart : తేనెతో గుండెకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

తేనెను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  ప్రత్యేకించి ఎంతో కీలకమైన మన గుండెకు మేలును చేకూర్చే చాలా ఔషధ గుణాలు తేనెలో ఉన్నాయి.

  • Written By:
  • Updated On - June 22, 2024 / 12:04 PM IST

Honey – Heart : తేనెను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  ప్రత్యేకించి ఎంతో కీలకమైన మన గుండెకు మేలును చేకూర్చే చాలా ఔషధ గుణాలు తేనెలో ఉన్నాయి. అయితే తేనెను నేరుగా వాడితే మన గుండెకు ఆ ప్రయోజనం లభించదు. తేనె, దాల్చిన చెక్క పౌడరు కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఓట్​మీల్, టీ, బేకరీ ఫుడ్స్‌లో వాడినా రుచికరంగానే ఉంటుంది.  తేనె, దాల్చిన చెక్క కలిపి తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే రిస్కు తగ్గుతుంది. దీనివల్ల మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులు(Honey – Heart) తగ్గుతాయి. సడెన్‌గా హార్ట్ స్ట్రోక్​ వచ్చే ముప్పు తొలగుతుంది. చాలా శాస్త్రీయ అధ్యయనాల్లో ఈవివరాలు వెల్లడయ్యాయి. తేనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా.. దానిని మితంగా తీసుకోవాలి. రోజుకు ఓ స్పూన్ తేనె తీసుకుంటే సరిపోతుంది.

We’re now on WhatsApp. Click to Join

  • వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మన శరీరంలో రక్త ప్రసరణను ఈజీగా చేస్తుంది. వెల్లుల్లిని తేనెలో కలిపి తింటే బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది.వెల్లుల్లిలోని రసాయనాలు శరీరంలోని మంటను, వాపును తగ్గిస్తాయి. శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, విరేచనాలు వంటివాటిని తగ్గిస్తుంది. ఉబ్బసం, గుండె జబ్బులు, అధికరక్తపోటు, కీళ్లనొప్పులు, పంటి నొప్పి, మలబద్ధకం వంటివాటిని తగ్గిస్తుంది.
  • ఉదయాన్నే వేడినీళ్లలో కాస్త తేనె, నిమ్మరసం వేసుకుని తాగాలి. ఇలా చేస్తే మన జీర్ణ వ్యవస్థ ఫిట్‌నెస్‌తో ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు. మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. అలెర్జీలు తగ్గుతాయి.
  • రోజూ రెండు ఉసిరికాయల్ని తింటే బాడీలోని కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.
  • అవిసెలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. వీటిని పొడిలా చేసి పాలలో కలిపి తాగాలి. షుగర్ వ్యాధి కూడా కంట్రోల్‌‌లో ఉంటుంది. అవిసెలలోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
  • రోల్డ్ ఓట్స్, రైస్ బ్రాన్, సిట్రస్ ఫ్రూట్స్, హెల్ గ్రెయిన్స్ వంటివి తింటే బాడీలోని కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. బరువు కంట్రోల్ అవుతుంది.

Also Read :Life Expectancy : చిన్న చేపలను ముళ్లతో సహా తింటే.. ఆయుష్షు అప్!

అంగస్తంభన, స్పెర్మ్ హెల్త్ కోసం..

అంగస్తంభనను తగ్గించుకోవాలని భావిస్తే తేనె వాడాలి. పాలల్లో తేనె కలిపి తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. టెస్టోస్టిరాన్​ను గణనీయంగా పెంచి.. సంతానోత్పత్తి సమస్యలను తేనె దూరం చేస్తుంది. మహిళల యోని, గర్భాశయ సమస్యలను తేనె దూరం చేస్తుంది. స్త్రీల అండాశయంలో ఏర్పడే ఎగ్ క్వాలిటీని తేనె పెంచుతుంది.

Also Read : Shahrukhs House : బాలీవుడ్ బాద్‌షా ఇంట్లో ఉండే ఛాన్స్ .. రెంట్ ఎంతో తెలుసా ?