Moon Milk : ఒత్తిడిని తగ్గించి ఇమ్యూనిటీని పెంచాలంటే రోజు ఈ పాలను తాగాల్సిందే..!

మూన్ మిల్క్ (Moon Milk) అంటే ఏమిటి? దీన్ని ఎలా తయారు చేస్తారు? దీన్ని రోజు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం...

Benefits of Drinking Moon Milk : రోజు మనం లేదా మన పిల్లలు తాగే పాలు కాదు ఇవి. అలాగని ఓ కొత్త లేటెస్ట్ ట్రెండ్ పాలు అనుకునేరు… మన పురాతనమైన ఆయుర్వేదాల ప్రకారం ఈ పాలను వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేసేందుకు వాడేవాళ్లు. ఈ పాలను మూన్ మిల్క్ (Moon Milk) అని పిలుస్తారు. అసలు మూన్ మిల్క్ అంటే ఏమిటి? దీన్ని ఎలా తయారు చేస్తారు? దీన్ని రోజు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…

మూన్‌ మిల్క్‌ (Moon Milk) అంటే ఏమిటి..?

సాధారణంగా మూన్ మిల్క్ ను ఆవు పాలతో తయారు చేస్తారు. మీకు కావాలంటే బాదం, సోయా, ఓట్స్ పాలతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పాలలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండే ఏలకులు, అల్లం, దాల్చినచెక్క, పసుపు వంటి ఆయుర్వేద మూలికలు ఉంటాయి. ఈ మూన్ మిల్క్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్‌ గుణాలు పుషకాలంగా లభిస్తాయి. ఈ పాలలో పసుపు ఉండటం వల్లన ఇవి మనకు బంగారు రంగులో కనిపిస్తాయి.

మూన్ మిల్క్ (Moon Milk) తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం…

ఈ పాలు నిద్రను ప్రోత్సహిస్థాయి..

మూన్‌ మిల్క్‌ లో అమైనో యాసిడ్, ట్రిప్టోఫాన్, సెరోటోనిన్, మూడ్-స్టెబిలైజింగ్ హార్మోన్ ఉండటం వల్ల ప్రశాంతమైన నిద్రను అందిస్తుందని నిపుణులు చెపుతున్నారు. రాత్రి నిద్రపోయే ముందు మూన్ మిల్క్ ను తాగితే నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు.

ఒత్తిడిని తగ్గుతుంది..

మూన్ మిల్క్ లో ఆశ్వగంధం ఉండటం వల్లన మన శరీరంలో ఉండే సార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది. అందువల్లన మనకు ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి. ఎపుడైనా మీకు స్ట్రెస్ ఎక్కువైతే మూన్ మిల్క్ ను తాగండి. ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.

రోగ నిరోధక శక్తిని మెరుగవుతుంది..

మూన్ మిల్క్ లో పసుపు అల్లం వంటివి ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను అధికంగా కలిగి ఉంటుంది. అందువల్లన మనలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపడుతుంది. వర్షాకాలంలో మూన్ మిల్క్ ను తరుచూ తాగడం వల్ల మీ ఇమ్యూనిటీని బూస్ట్‌ చేసుకోవచ్చు.

జీర్ణక్రియ పెరుగుతుంది..

మూన్‌ మిల్క్‌లో వేసే.. యూలకులు, దాల్చిన చెక్క దాని రుచిని పెంచడమే కాదు, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఈ మసాలాలు అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలకు చెక్‌ పెడతాయి. మూన్‌ మిల్క్‌ను భోజనం చేసిన తర్వాత తాగితే.. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

మూన్ మిల్క్ (Moon Milk) తయారీ విధానం..

కావలసినవి:

  1. ఒక గ్లాసు పాలు,
  2. అర టీస్పూన్ పసుపు,
  3. చిటికెడు దాల్చిన చెక్క పొడి,
  4. చిటికెడు యాలకుల పొడి,
  5. చిటికెడు అశ్వగంధ పొడి,
  6. చిన్న అల్లం ముక్క

తయారీవిధానం:

మూన్ మిల్క్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాసు పాలలో అర టీస్పూన్ పసుపు, చిటికెడు దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, ఒక టీస్పూన్ అశ్వగంధ పొడి, చిన్న అల్లం ముక్క వేయండి. దీన్ని స్టౌవ్‌ మీద పెట్టి కొంతసేపు మరిగించండి. పాలు మరిగిన తరువాత వేడి వేడిగా ఎంజాయ్ చేయండి.

Also Read:  WhatsApp Ads : వాట్సప్ చాట్ మధ్యలో యాడ్స్‌?.. అందరికి క్లారిటీ ఇచ్చిన మెటా..