Leather Maintenance: లెదర్‌ దీర్ఘకాలం మన్నాలా?

ఫ్యాషన్‌ మారినా లెదర్‌ ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటుంది. లెదర్‌ వస్తువులు లగ్జరీగా ఉంటాయి. ఇవి ఎక్కువకాలం కూడా మన్నుతాయి.

ఫ్యాషన్‌ మారినా లెదర్‌ ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటుంది. లెదర్‌ వస్తువులు లగ్జరీగా ఉంటాయి. ఇవి ఎక్కువకాలం కూడా మన్నుతాయి. అందుకే మనందరి వార్డ్‌రోబ్‌ లలో లెదర్ జాకెట్లు, బెల్ట్‌లు, బ్యాగ్‌లు, బూట్లు కచ్చితంగా ఉంటాయి. లెదర్‌ వస్తువులు ఎంత అందంగా ఉంటాయో వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. లెదర్‌ వస్తువులను సరిగ్గా మేయింటేన్‌ చేయకపోతే అవి చాలా త్వరగా పాడైపోతాయి. మీ లెదర్‌ వస్తువులు ఎక్కువ కాలం మన్నాలన్నా, కొత్తవాటిలా మెరవాలన్నా కొన్ని టిప్స్‌ కచ్చితంగా పాటించాలి.

ఉతకొద్దు:

లెదర్‌ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అందువల్ల లెదర్‌ బ్యాగ్‌లు, లెదర్‌ జాకెట్లను నీటితో శుభ్రం చేయవద్దు. ఒకవేళ లెదర్‌ తడిస్తే దాన్ని క్లాత్‌తో తుడవండి.

లెదర్‌ జాకెట్‌ను మడతపెట్ట వద్దు:

మీకు లెదర్‌ జాకెట్‌ ఉంటే వాటిని అల్మారాలో మడతపెట్టి ఉంచవద్దు. మీ లెదర్‌ జాకెట్‌ను హ్యాంగర్‌కు హ్యాంగ్‌ చేయండి. ఇలా చేస్తే ముడతలు రావు, లెదర చిరగకుండా ఉంటుంది. ఒకవేళ లెదర్‌ నలిగితే దానిని ఇస్ట్రీ చేయవద్దు.

సూర్యకాంతి నుంచి రక్షించండి:

లెదర్ వస్తువులు బ్యాగ్, వాలెట్, షూస్‌ను సూర్యకాంతికి దూరంగా ఉంచండి. డైరెక్ట్‌ సన్‌కు ఎక్స్‌పోజ్‌ అయితే లెదర్‌ త్వరగా కలర్‌ చేంజ్‌ అవుతుంది. దాని లైఫ్‌ టైమ్‌ కూడా తగ్గుతుంది.

డస్ట్‌ బ్యాగ్‌ వాడండి:

మీరు లెదర్‌ బ్యాగ్‌లను, జాకెట్లను క్లీన్‌ చేయడానికి డస్ట్‌ బ్యాగ్‌ బెస్ట్‌ ఆప్షన్‌. డస్ట్‌ బ్యాగ్‌ జాకెట్‌, పర్స్‌పై పేరుకుపోయిన దుమ్ము, మట్టిని త్వరగా శుభ్రం చేస్తుంది. దీంతో లెదర్‌ లైఫ్‌స్పాన్‌ కూడా పెరుగుతుంది.

లెదర్‌ బ్యాగ్స్‌ను ఇలా క్లీన్‌ చేయండి:

బ్యాగ్‌, షూస్‌ పైన ఉన్న మురికిని శుభ్రం చేయడానికి గట్టి బ్రష్‌ను ఉపయోగించండి. లెదర్‌ జిడ్డుగా ఉంటే, ఒక స్ప్రే బాటిల్‌లో డిటర్జెంట్‌ మిక్స్‌ చేసిన వాటర్‌ పోసి బ్యాగ్‌పై స్ప్రే చేయండి. ఆ తర్వాత పొడి వస్త్రంతో నెమ్మదిగా తుడవండి. ఇలా చేస్తే లెదర్‌ క్రిస్టల్‌ క్రియర్‌గా ఉంటుంది.