Site icon HashtagU Telugu

Belly Fat : బీరు వల్ల పొట్ట పెరుగుతోందా ? ఇలా చేస్తే మొత్తం కరిగిపోద్ది..

belly fat tips

belly fat tips

Belly Fat : ఉదయం లేవగానే చాలామందికి టీ, కాఫీలు తాగే అలవాటు ఎలా ఉంటుంది. అలాగే రాత్రి పూట ఒక్క బీరైనా పడనిదే నిద్రపోనివారెందరో ఉంటారు. టీ, కాఫీల తర్వాత ప్రపంచంలో అంతటి ప్రసిద్ధి చెందిన పానీయం బీరే మరి. ఇదిచ్చే కిక్కుతో ఉన్న టెన్షన్స్ అన్నీ మరచిపోయి.. ఆదమరచి నిద్రపోతారు. కానీ.. ప్రతిరోజూ బీర్ తాగడం వల్ల బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొట్టభాగంలో కొవ్వు పెరుగుతుంది. ఫలితంగా ఎంత కండలున్న బాడీ ఉన్నా అంద విహీనంగా కనిపిస్తారు.

రోజూ బీర్ తాగేవారికి బెల్లీ ఫ్యాట్ త్వరగా పెరిగిపోతుంది. ఇది ఇప్పటికే చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. పెద్దపొట్టతో చూడటానికి అందవిహీనంగా కనిపిస్తారు. బీర్ లో ఉండే అదనపు క్యాలరీలే బెల్లీ ఫ్యాట్ కు కారణమవుతాయి. బీర్ లో ఆల్కహాల్ తో సమానంగా ఉండే క్యాలరీలు ఉంటాయి. బీర్ అధికంగా తాగడంతో పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. తాగిన తర్వాత తినకుండా అలాగే పడుకోవడం వల్ల కూడా వివిధ రకాల ఆరోగ్య సమస్యలొస్తాయి. వీటి వల్ల కూడా కొవ్వు పేరుకుపోతుంది.

బీర్ తాగడం వల్ల మీ పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోతుంటే గనుక.. దానిని తగ్గించుకునేందుకు కొన్నిపనులు చేయండి. మీరు తినే ఆహార క్యాలరీలపై శ్రద్ధ పెట్టండి. ప్రతిరోజూ ఎన్ని క్యాలరీలు తింటున్నారో లెక్కించండి. బీర్ తాగడాన్ని నిదానంగా తగ్గించండి. అలాగే డెజర్ట్ లో ఐస్ క్రీమ్ కు బదులుగా పండ్లు తినడం అలవాటు చేసుకోండి. అలాగే సోడాకు బదులుగా నీరు తాగండి. అలాగే మీరు తినే వంటలలో బటర్ కు బదులుగా ఆలివ్ ఆయిల్ వంటి హెల్తీ ఫుడ్స్ ను ఎంచుకోండి.

ఎక్కువసేపు శరీరాన్ని రెస్ట్ మోడ్ లో ఉంచకండి. బరువు తగ్గాలంటే శారీరక శ్రమ అవసరం. రోజుకు ఒక గంట పాటు వాకింగ్ చేయాలి. ఏరోబిక్ వ్యాయామాలను అలవాటు చేసుకోవాలి. రాత్రివేళలో ఫుడ్ ఎక్కువగా తినడాన్ని కూడా మానుకోవాలి. బలమైన ఆహారాన్ని తినాలి. వీలైనంత వరకూ ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్ ను ప్రిఫర్ చేయాలి. ఇలాంటి డైట్ చేయడం ప్రారంభించిన తర్వాత.. బీర్ ను తాగడం పూర్తిగా మానేయాలి. అప్పుడే మీ పొట్టలో ఫ్యాట్ తగ్గుతుంది.

Also Read : Egg Shells Facepack : కోడిగుడ్డు పెంకులతో ఫేస్ ప్యాక్స్.. ఉపయోగాలు తెలిస్తే అస్సలు పారేయరు..

Exit mobile version