Dandruff: ఈ 5 ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే.. మీ చుండ్రు ఇట్టే తగ్గుతుంది..

వేప పొడి, ఉసిరిని ఉపయోగించి పేస్ట్‌ను తయారు చేసి దానిని నీరు లేదా అలోవెరా జెల్‌తో కలిపి స్కాల్ప్‌కు అప్లై చేయండి. 30నిమిషాల పాటు అలాగే ఉంచి తల స్నానం చేయండి.

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 09:46 PM IST

Dandruff: చలికాలం వచ్చిందంటే చాలా మంది చుండ్రు సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్నో షాంపూలు, నూనెలు వాడినా చుండ్రు సమస్య వెంటాడుతూనే ఉంటుంది. కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు. రసాయనాలతో కూడిన ఉత్పత్తులను ఉపయోగించే బదులు సహజ పదార్థాలను ఉపయోగించి చుండ్రు సమస్యను దూరం చేయొచ్చు.. అవేంటో చూద్దాం.

వేడి ఆయిల్ మసాజ్‌తో చుండ్రును దూరం చేయవచ్చని ఆయుర్వేదం అంటుంది. చలికాలంలో స్కాల్ప్, వెంట్రుకలను పోషించడానికి ఇది ఉపయోగపడుతుంది. టీ ట్రీ లేదా వేప వంటి నూనెలతో వెచ్చని కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా రెండింటినీ కలిపి బాగా మసాజ్ చేయండి. అలా చేయడం వలన స్కాల్ప్‌పై తేమను పెంచడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

వేప పొడి, ఉసిరిని ఉపయోగించి పేస్ట్‌ను తయారు చేసి దానిని నీరు లేదా అలోవెరా జెల్‌తో కలిపి స్కాల్ప్‌కు అప్లై చేయండి. 30నిమిషాల పాటు అలాగే ఉంచి తల స్నానం చేయండి. వేప, ఉసిరిలో ఉన్న యాంటీమైక్రోబయిల్ లక్షణాల వలన ఈ మిశ్రమం చుండ్రుతో పోరాడటమే కాకుండా శిరోజాలకు పోషణనిస్తుంది.

మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, వాటిని పేస్ట్‌లా చేసి తలకు బాగా పట్టించండి. ఈ పేస్ట్ చుండ్రు వలన కలిగే పొడి, దురదను తగ్గిస్తుంది. తద్వారా చుండ్రు సమస్యలు తగ్గుతాయి.

తాజా కలబంద జెల్‌ను నేరుగా మీ తలకు అప్లై చేసి 20-30నిమిషాలు అలాగే ఉంచండి. దీని కూలింగ్, హైడ్రేటింగ్ ఎఫెక్ట్స్ స్కాల్ప్‌ ఉపశమనానికి, చుండ్రును తగ్గించడానికి సహాయపడతాయి.

రోజ్మేరీ, థైమ్ లేదా సేజ్ వంటి మూలికలను నీటిలో ఉడకబెట్టడం వలన హెర్బల్ రిన్స్‌ను సిద్ధమౌతుంది. ఈ మిశ్రమం చల్లారాక వడకట్టి, షాంపూ చేసిన తర్వాత చివరిగా శుభ్రం చేసుకోండి. ఈ మూలికలు యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.