Site icon HashtagU Telugu

Beauty Care: వాయు కాలుష్యం నుంచి చర్మం జుట్టును సంరక్షించుకోవాలంటే ఇలా చేయాల్సిందే?

Mw Et904 Air Po Mg 20160815113243

Mw Et904 Air Po Mg 20160815113243

ఈ రోజుల్లో వాహనాల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. వాహనాల వినియోగం రోజురోజుకీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దాంతో వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ వాయు కాలుష్యం కారణంగా మనుషులు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల రకరకాల అనారోగ్యాల బారిన పడటంతో పాటు చర్మానికి జుట్టుకు కూడా సంరక్షణ లేకుండా పోతోంది.
వాయు కాలుష్యం కారణంగా ఊపరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ అనారోగ్యాలు, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌, రక్తనాళ సంబంధ వ్యాధుల ముప్పును పెంచుతుంది. అయితే మరి వాయు కాలుష్యం నుంచి మీ జుట్టు మీ చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాయు కాలుష్యం కారణంగా.. గాలిలో జుట్టు, చర్మానికి హాని చేసే విష పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పర్టిక్యులేట్ మ్యాటర్, ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు అత్యంత సాధారణ కాలుష్య కారకాలు. ఇవి మీ చర్మం, హెయిర్ ఫోలికల్స్‌లోకి ప్రవేశించి, ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్‌, డీహైడ్రేషన్‌, స్థితిస్థాపకత కోల్పోవడం, పిగ్మెంటేషన్, బ్రేక్‌ అవుట్‌లు, జుట్టు రాలడం,తలపై చికాకు వంటి సమస్యలను కలిగిస్తాయి. మీ చర్మం, జుట్టుపై పేరుకున్న మురికి, నూనె, కాలుష్య కారకాలు తొలగించడానికి శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. మీ చర్మానికి సరిపోయే, తేమను తొలగించకుండా ఉండే సోప్, క్లెన్సర్ లతో స్నానం చేయాలి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే సున్నితమైన షాంపూతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి.

వాయు కాలుష్యం కారణంగా చర్మం, జుట్టు డీహైడ్రేట్‌ అవుతుంది, వాటిలోని పోషకాలు కోల్పోతుంది. దీంతో చర్మం, జుట్టు నిర్జీవంగా మారతాయి. మీ చర్మం, జుట్టులో జీవం నింపడానికి మాయిశ్చరైజింగ్ కీలకం. మీ చర్మం తేమను లాక్ చేయడానికి మాయిశ్చరైజ్‌ చేయడం చాలా ముఖ్యం. జోజోబా ఆయిల్, షియా బటర్‌ వంటి న్యాచురల్‌ మాయిచ్చరైజర్లను రోజూ అప్లై చేసుకోండి. మీ జుట్టును హైడ్రేట్ చేయడానికి, పోషణ అందించడానికి వారానికి ఒకసారి లీవ్-ఇన్ కండీషనర్, హైయిర్‌ మాస్క్‌లు అప్లై చేయాలి. అలాగే స్కార్ఫ్ , క్యాప్ వంటివి కాలుష్య కారకాలకు గురికాకుండా రక్షిస్తాయి.

మీ నుదురు, చెవులు, మెడ, జుట్టును కవర్‌ చేసేలా స్కార్ఫ్‌ కట్టుకోండి. తద్వారా మీ జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. వాయు కాలుష్యం నుంచి మీ చర్మం, కేశాలను రక్షిస్తుంది. మీ డైట్‌లో సమతుల్య ఆహారం తీసుకుంటే ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్‌ నుంచి చర్మం, జుట్టు కణాలను రక్షిస్తుంది. మీ డైట్‌లో యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, విటమిన్ రిచ్‌ ఫుడ్స్‌ తీసుకోవాలి. చక్కెర, ఉప్పు, కొవ్వు, ప్రాసెస్ చేసిన పదార్ధాలు అధికంగా ఉండే ఆహారాలను నివారించాలి. అలాగే శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి.