Winter Hair Care: చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే?

మామూలుగా చలికాలంలో మనకు జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జుట్టు చిట్లిపోవడం, పొడిబారడం, చుండ్రు సమస్య

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 06:30 PM IST

మామూలుగా చలికాలంలో మనకు జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జుట్టు చిట్లిపోవడం, పొడిబారడం, చుండ్రు సమస్య ఇలా ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా చలికాలంలో జుట్టు ఎక్కువగా పొడిబారుతూ ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో హెయిర్‌ కేర్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మరి చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలం అని చాలామంది నీరు తాగకుండా ఉంటారు. కానీ అలా కాకుండా చలికాలంలో కూడా తప్పకుండా ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని తాగుతూ ఉండాలి.. అలాగే సీజన్ ప్రకారంగా దొరికే కాయగూరలు పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. ఇవి జుట్టుకు కూడా పోషణ అందించి, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ సీజన్‌లో దొరికే పండ్లు, కూరగాయలు కచ్చితంగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చలికాలంలో వేడి బజ్జీలు, సమోసాలు ఎక్కువగా లాగించేస్తూ ఉంటారు.

చలికాలం మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేయించిన ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. శీతాకాలం రుచికరమైన వంటకాలను ఆస్వాదించడం ఫర్వాలేదు. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. ఏదైనా అధికంగా తీసుకోవడం వల్ల మానవ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. చర్మం, జుట్టు కణాలకు రక్తం ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలుగుతుంది. చలికాలంలో జుట్టుకు ఎంత తరచుగా నూనె పెడితే అంత మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి సహాయ పడుతుంది. ఇది జుట్టు పొడిబారకుండా రక్షిస్తుంది. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండి, వేడినీటితో స్నానం, తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి. ఎక్కువ వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తే చర్మం, శిరోజాల్లోని సహజనూనెల శాతం తగ్గిపోయి పొడిగా, నిర్జీవంగా మారిపోతాయి.