Site icon HashtagU Telugu

మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే?

Men Skincare

Men Skincare

ఈ రోజుల్లో కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా అందంగా కనిపించడం కోసం రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు హోమ్ రెమెడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. అందం విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. అయితే పురుషులు కూడా అందంగా కనిపించాలి అంటే కొన్ని రకాల చిట్కాలు పాటించడం తప్పనిసరి. మగవారు చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పురుషులు షేవ్ చేసుకున్న తర్వాత ఇరిటేషన్, దురదలు కలగడం, డార్క్ స్పాట్స్, యాక్నీ వంటి సమస్యలు పురుషులలో ఎక్కువగా ఉంటాయి. కనుక పురుషులు కూడా వల్ల చర్మంపై శ్రద్ధ తీసుకోవాలి.

డ్రై స్కిన్ అయినా ఆయిల్ స్కిన్ అయినా లేదా కాంబినేషన్ స్కిన్ అయినా కచ్చితంగా వాళ్లకి తగ్గ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉండాలి. డైలీ స్కిన్ కేర్ రొటీన్‌ని ఫాలో అవ్వాలి. దీంతో మరింత అందంగా మారడానికి అవకాశం ఉంది.అయితే పురుషులు వారి యొక్క స్కిన్ టోన్‌కి తగ్గట్టుగా స్కిన్ కేర్‌ని పాటిస్తూ ఉండాలి. క్లియర్ ఆరోగ్యకరమైన చర్మం కోసం డెర్మటాలజిస్ట్ చెప్పిన ఈ చిట్కాలను పాటిస్తే మంచిది. మగవారు వాళ్ళ చర్మానికి ఎలా శ్రద్ధ తీసుకోవాలి అనేది చూస్తే ప్రతి రోజు కూడా ముఖాన్ని రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే దుమ్ము, ధూళి వంటివి తొలగిపోతాయి. అదే విధంగా చర్మం పై వుండే డెడ్ స్కిన్ ఆయిల్ వంటివి కూడా తొలగిపోతాయి. దీంతో చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

అలాగే చర్మం బ్రైట్‌గా, అందంగా కనబడుతుంది. అదే విధంగా మహిళలకు ఎలా అయితే ఎక్స్‌ఫోలియేషన్ అవసరమో పురుషులు కూడా ఎక్స్‌ఫోలియేషన్‌కి ప్రాముఖ్యత ఇవ్వాలి. కనీసం వారానికి రెండు నుండి మూడు సార్లు ఎక్స్ ఫోలియేషన్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం క్లియర్‌గా ఉంటుంది. మృదువుగా ఉంటుంది..ఇలా చేయడం వలన డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుంది. మీరు ఎక్స్‌ఫోలియేషన్ చేసేటప్పుడు గట్టిగా ఉండే స్క్రబ్స్, బ్రష్లు వంటివి ఉపయోగించ వద్దు. వీటిని కనుక ఉపయోగిస్తే దురద ఇరిటేషన్ లాంటి సమస్యలు వస్తాయి. అలానే ఎక్కువ సూర్యకిరణాల వల్ల కూడా చర్మానికి హాని కలుగుతుంది. అటువంటి సమయంలో మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండడం ముఖ్యం. ఎప్పుడూ కూడా మీరు ఎస్పిఎఫ్ 30 కంటే ఎక్కువ ఉండే దానిని ఉపయోగించండి.

దీని వల్ల స్కిన్ కాన్సర్ వంటి సమస్యలు కూడా రావు. అలానే మీ చర్మం కూడా బాగుంటుంది. మంచి స్కిన్ కేర్ రొటీన్‌ని పాటించడం కూడా చాలా ముఖ్యం. విటమిన్ సి లేదా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ప్రొడక్ట్స్ని ఉపయోగించండి. రెగ్యులర్‌గా సన్ స్క్రీన్‌ని ఉపయోగించండి దీంతో మీ చర్మం బాగుంటుంది. అలానే అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యంపై కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం సరిగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో మంచి పోషక పదార్థాలు తప్పకుండా ఉండేలా చూసుకోండి. మీ బ్లడ్ షుగర్ లెవల్స్‌ని సరిగ్గా కంట్రోల్‌లో ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి.

Exit mobile version