అమ్మాయిలు పొడవాటి గోర్లు కావాలని అనుకుంటూ ఉంటారు. గోర్లు పొడవుగా అందంగా ఉండటాన్ని వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అందుకోసంఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అలా గోర్లు పెరగడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే వెంటనే ఇలా చేయాల్సిందే. మరి గోర్లు పెరగడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. గోళ్లలో తేమని నిలిపి ఉంచే గుణం ఉండదు. వాటిలో సరిపడా తేమ లేకపోతే పొడిబారి పెళుసుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే కాస్త పొడుగు పెరగ్గానే వెంటనే విరిగిపోతుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే గోళ్లకు అవసరమైన తేమని అందించడం మంచిది.
గోరు వెచ్చని కొబ్బరి నూనేతో మీ గోళ్లు మాసాజ్ చేస్తే గోళ్లు దృఢంగా, త్వరగా పెరుగుతాయి. కొబ్బరి నూనెలో విటమిన్ ఈ, మెండుగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే మార్పు మీకే తెలుస్తుంది. మీ గోళ్లు పెళుసుగా తయారైతే ఆలివ్ నూనె మీకు మంచి సొల్యూషన్. ఆలివ్ నూనె మీ గోళ్ల లోపలి పొరకు చేరి, దానికి తేమను అందించి పొడిబారిన గోళ్లను నయం చేస్తుంది. ఇది రక్త ప్రసరణకు కూడా సహాయపడుతుంది. గోళ్ల పెరుగుదలకు సహాయపడుతుంది. ఒక చెంచా ఆలివ్ ఆయిల్‌కు కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని రాత్రిపూట నిద్రపోయే ముందు గోళ్లకు బాగా పట్టించి, మర్దన చేసుకుని, గ్లౌవ్స్ వేసుకోవాలి.
తెల్లవారే సరికి గోళ్లు లేతగా మారడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్ తీసుకుని గోళ్లను రోజూ 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల పెళుసుదనం తగ్గి మృదువుగా మారతాయి. పోషణ కూడా అంది పొడుగ్గా పెరుగుతాయి. విటమిన్ సి గోళ్ల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. రోజూ ఐదు నిమిషాలపాటు నిమ్మకాయతో గోళ్లపై రద్దాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మీ గోర్లు పెరగడానికి సహాయపడుతుంది. గోర్లపై బ్యాక్టీరియా తొలగి శుభ్రంగా ఉంటాయి. వెల్లుల్లిలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది గోళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తోంది. వెల్లుల్లి ముక్కతో మీ వేలుగోళ్లను రుద్దండి. అది మీకు చాలా ఘాటుగా ఉంటే, మీరు సొంతగా వెల్లుల్లి నూనెను తయారు చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి నూనెను గోరు వెచ్చగా ఉపయోగించండి. వారానికి ఒకసారి దీన్ని ప్రయత్నించాలి.