Risk Of Sunburn : ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ – జూన్ మధ్యకాలంలో టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ భానుడి భగభగల ప్రభావాన్ని ప్రధానంగా ఎదుర్కొంటున్నది ఔట్ డోర్ వర్కర్లే. వ్యవసాయ కూలీలు, రోడ్లపై చిరువ్యాపారాలు చేసుకునేవారు, నిర్మాణ రంగ కార్మికులు, ఆరుబయట వర్క్స్ చేసే వారు ఎండల్లో ఎంతో శ్రమిస్తుంటారు. ఎండలు మండిపోతున్న ప్రస్తుత సీజన్‌లో ఔట్ డోర్ వర్కర్ల ఆరోగ్యాన్ని కాపాడేలా, వారు వడదెబ్బ బారినపడకుండా చర్యలు తీసుకోవాల్సిన నైతిక బాధ్యత అందరిపై ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join
నిపుణుల సూచనలు ఇవీ..
- వేసవి కాలం ముగిసే వరకు.. ఔట్ డోర్ వర్కర్లకు(Risk Of Sunburn) సాధ్యమైనన్ని పని గంటలను తగ్గించాలి. ఎండ తక్కువగా ఉన్న సమయానికి షిఫ్టులను మారిస్తే చాలా బెటర్.
- కార్మికులు పనిచేసే చోట షామియానాలను వేస్తే మంచిది.
- తాగునీటి వసతిని కల్పించడం కనీస ధర్మం.
- అత్యవసర వైద్య కిట్‌ను అందుబాటులో ఉంచాలి. అవసరమైతే దాని ద్వారా చికిత్స అందించొచ్చు.
- కార్మికులకు పని మధ్యలో బ్రేక్ ఇవ్వాలి. తద్వారా వారు కొంత విశ్రాంతి తీసుకుంటారు.
- వడగాలులు, ఎండను లెక్క చేయకుండా పనిచేస్తే వడదెబ్బ బారినపడే ముప్పు ఉంటుంది. దీనిపై కార్మికులకు అవగాహన కల్పించాలి.
Also Read :BJP 300 : బీజేపీకి 300 సీట్లు.. ఏపీలో జగన్ ఔట్, తెలంగాణలో కమలం హవా : పీకే
మహిళా వర్కర్ల విషయంలో..
- ‘ఔట్ వర్కర్లు – సమ్మర్ సీజన్’ అనే అంశంపై అమెరికాకు చెందిన పాల్ జీ అలెన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అధ్యయనం నిర్వహించింది. దీనికి సంబంధించిన స్టడీ రిపోర్టు ఈ ఏడాది మార్చిలో ‘వన్ ఎర్త్’ జర్నల్‌లో పబ్లిష్ అయింది.
- అధ్యయన నివేదిక ప్రకారం .. ప్రపంచవ్యాప్తంగా 81 కోట్ల మంది ప్రజలు ఈసారి మండుటెండల ముప్పును ఎదుర్కోబోతున్నారు. ఈ ప్రాంతాలలో ఏప్రిల్ – జూన్ మధ్యకాలంలో ఔట్ డోర్ వర్క్స్ చేసుకునే వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు.
- ఔట్ డోర్ వర్కర్ల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే.. రోజూ ఉదయం వేళ పనిగంటలు తగ్గించడం మంచిది.
- ఔట్‌డోర్ వర్కర్లలో గర్భిణులు కూడా ఉంటారు. వారికి వడదెబ్బ తాకితే గర్భంలోని బిడ్డపై ప్రభావం పడే రిస్క్ ఉంది. ఇలాంటి మహిళలలో 6.1 శాతం మందిలో బిడ్డ కడుపులోనే చనిపోయే ముప్పు ఉందని స్టడీ రిపోర్టు తెలిపింది. కొందరిలో 9 నెలల కంటే ముందే డెలివరీ జరిగే అవకాశం ఉందని పేర్కొంది.