Vasthu Tips: ఈ రెండు మొక్కలు మీ ఇంట్లో ఉంటే చాలు.. కాసుల వర్షమే?

భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. తులసి మొక్కను

  • Written By:
  • Publish Date - November 11, 2022 / 06:00 AM IST

భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. తులసి మొక్కను పవిత్రమైనదిగా భావించడంతోపాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్కను పూర్వకాలం నుంచే ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రాదని అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని నమ్మకం.

తులసి మొక్క ఏపుగా పెరిగితే ఆ ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉండవు అని భావిస్తారు. అంతేకాకుండా తులసి మొక్క ఉన్న ఇల్లు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. తులసి మొక్కలు లక్ష్మీదేవితో పాటు విష్ణు కూడా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇంట్లో తులసి మొక్కతో పాటుగా మరొక రెండు మొక్కలను పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి వరిస్తుంది. మరి ఆ రెండు మొక్కలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తులసి మొక్కతోపాటు ఆ మొక్కను కూడా నాటడం వల్ల బ్రహ్మ,విష్ణు,మహేశ్వర పూజలు కూడా జరుగుతాయి. ఆ చెట్లు ఏంటి అన్న వివరాల విషయానికొస్తే.. అందులో ఒకటి శమీ చెట్టు కాగా మరొకటి నల్ల ధాతురా(ఉమ్మెత్త పువ్వు). ఈ మొక్కల వల్ల ఆర్థిక సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. నల్ల ధాతురా మొక్కలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. కాగా వాస్తు ప్రకారం తులసి మొక్కను నాటడం వల్ల ఆర్థిక సమస్యలు దరిచేరవు. అంతే కాకుండా ఉద్యోగం వ్యాపారాలలో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. నిధి తులసి మొక్కలు రెండు రకాల తులసి మొక్కలు ఉంటాయి. సాధారణ తులసి మొక్కతో పాటు నల్ల తులసి లేదా విష్ణు తులసి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రెండింటిని కలిపి నాటాలి. ఈ రెండు మొక్కలను కలిపి పూజించడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకేసారి పూజించెనంత పొలం దక్కుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు పోయే లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది.