జీన్స్ ప్యాంట్ అంటే తెలియనివారుండరు. ప్రస్తుతం జెండర్‌తో సంబంధం లేకుండా అందరూ జీన్స్ ప్యాంట్స్ ధరిస్తున్నారు. చాలా మంది యువత జీన్స్ ప్యాంట్ వేసుకోవడానికే మక్కువ ఎక్కువ చూపిస్తారు. ఏదైనా ఫెస్టివల్ లేదా శుభకార్యం అయితే మనం కచ్చితంగా కొత్త జీన్స్ ప్యాంట్, షర్ట్ కొంటాం. సాధారణంగా కాస్ట్లీ జీన్స్ ప్యాంట్ ధర రూ. 5 నుంచి 6 వేల రూపాయలు ఉంటుంది. అయితే ధనవంతులు కొనే జీన్స్ ప్యాంట్స్ మాత్రం రూ. 2 లక్షల వరకు ఉంటాయి.
అయితే.. తాజాగా ఓ వ్యక్తి జీన్స్ ప్యాంట్‌ను రూ. 62 లక్షలు పెట్టి కొన్నాడు. 1880 కాలంలోని లెవీ జీన్స్ ప్యాంట్‌ను ఏకంగా రూ. 62 లక్షల రూపాయలు పెట్టి ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880 కాలం నాటి లెవీ జీన్స్ 76,000 డాలర్ల (దాదాపు రూ.62 లక్షలు)కు ఒక వ్యాపారి కొనుగోలు చేశాడు. అయితే ఈ కొనుగోలుదారుడు ప్రీమియంతో 87,400 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
అక్టోబర్ 1న జరిగిన వేలంలో ఈ జీన్స్ ప్యాంట్‌ను ఆ వ్యాపారి కొనుగోలు చేశాడు. పాతకాలపు దుస్తుల కంపెనీ డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్‌సన్‌తో కలిసిఈ జీన్స్ ప్యాంట్‌ను కొనుగోలు చేశాడు. గెలుపొందిన బిడ్‌లో 90 శాతాన్ని హౌపెర్ట్ చెల్లించాడు.ఈ జీన్స్ మరింత ఎక్కువ రేటుకి అమ్మాలని వారు భావిస్తున్నారు. ఈ ఖరీదైన జీన్స్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ ప్యాంట్ ధరను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంత మొత్తం డబ్బుతో లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.