Kitchen Tips For Body Pains: వంటింటి ఆరోగ్యం.. ఈ చిట్కాలతో ఒళ్ళు నొప్పులు మాయం!

ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో అలసట ఆందోళనలు సర్వసాధారణమైపోయాయి. చాలామంది రోజంతా కష్టపడి పని

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 08:30 AM IST

ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో అలసట ఆందోళనలు సర్వసాధారణమైపోయాయి. చాలామంది రోజంతా కష్టపడి పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కంటి నిండా హాయిగా నిద్ర పోదాము అనుకుంటే ఈ వంటి నొప్పుల కారణంగా సరిగా నిద్ర పట్టకపోగా కూర్చోడానికి నిల్చడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. శారీరక శ్రమ అధిక అవ్వడం వల్ల కీళ్ల నొప్పులు వంటి నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి. అయితే చాలామంది ఇలా ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు.

అయితే ప్రతిసారి కూడా ఈ విధంగా నొప్పి నివారణ మందులు తీసుకోవడం అంతా మంచిది కాదు. ఇలా కీళ్ల నొప్పులు వచ్చినప్పుడు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒళ్ళు నొప్పులు, జలుబు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సమయంలో బాగా వేడి చేసిన నీటిలో జండూబామ్ పసుపు వేసి దుప్పటి కప్పుకొని ఆవిరి పట్టుకోవాలి. కేవలం ముఖానికి మాత్రమే ఆవిరి పట్టుకుని అనంతరం స్నానం చేస్తే జలుబు,ఒళ్ళు నొప్పులు లాంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే మన వంటింట్లో దొరికే అల్లం ని తీసుకోవడం వల్ల శరీర నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

అల్లం ముక్కలను దంచి ఒక చిన్న బట్టలో కట్టి ఆ బట్టను వేడి నీటిలో కొన్ని నిమిషాల పాటు ఉంచి చల్లారిన తర్వాత నొప్పి ఉన్న భాగంలో పట్టించడం వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. అలాగే పసుపును పాలలో కలుపుకొని తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. లేదంటే నొప్పి ఉన్న భాగంలో పసుపును పేస్టులా చేసే పట్టించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. పసుపులో అనేక రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.