Malaika Arora: బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా ఆరోగ్య రహస్యం ఇదే

బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా కూడా ఎంత ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తుందో తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Malaika Arora

Malaika Arora

Malaika Arora: బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా కూడా ఎంత ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తుందో తెలిసిందే. తన గ్లామరస్ ఫిజిక్ కోసం ఎంతో కసరత్తులు చేస్తుంటుంది. ప్రతిరోజు ఉదయం జిమ్ లో తెగ కష్టపడుతూ అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేస్తుంటుంది. నిత్యం ప్రతిరోజు తాను చేసిన వివిధ ఆసనాల వీడియోను షేర్ చేసింది. ఇందులో కష్టమైన ఆసనాలతోపాటు అదిరే అందాలను చూపించింది.

తాను ఏవిధంగా స్లిమ్ ఉంటుందో రివీల్ చేసింది. నిమ్మ, తేనే కలిపిన గోరు వెచ్చని నీళ్లతో తన రోజును ప్రారంభిస్తానని, కొన్నేళ్లుగా ఇదే చేస్తున్నానని తెలిపింది. ఇలా చేయడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్లిపోతాయని చెప్పింది. అదేవిధంగా బాడీలో కొవ్వు పదార్థం తగ్గి శరీరం నాజూగ్గా తయారవుతుందని పేర్కొంది. దీని వల్ల చాలా యంగ్ గా కనిపిస్తారని ఈ బాలీవుడ్ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇక ” మాకు ఈ చిట్కా చెప్పినందుకు వెరీ వెరీ థ్యాంక్స్” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మలైకాను తెగ పొగడుతున్నారు.

ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అనే పాటతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.ఆ తర్వాత ఆమె 25 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ దంపతులకు ఒక కొడుకు కూడా జన్మించాడు.ఇదిలా ఉంటే నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో మలైకా అరోరా ఒక విషయం గురించి చెప్పుకొచ్చింది. ఆమె పెళ్లి తన ప్రొఫెషనల్ లైఫ్ పై మాత్రం ప్రభావం చూపించలేదు అని ఆమె వెల్లడించింది.

  Last Updated: 06 Oct 2023, 04:39 PM IST