పిల్లలు మీ మాట వినాలంటే ఈ వాస్తు చిట్కాలు పాటించండి!

సాధారణంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వారి హెల్త్

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 04:25 PM IST

సాధారణంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వారి హెల్త్ విషయంలో, చదువు విషయంలో, ప్రవర్తన విషయంలో క్రమశిక్షణ విషయంలో ఇలా అన్ని విషయాలలో కూడా వారి మాటలు వినాలి. వారి మాటలకు తగ్గట్టుగా పిల్లల్ని నడుచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ కాలం మారుతున్న కొద్దీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పిల్లలు పెద్దలను ఎదిరించడం వారి మాట వినకపోవడం లాంటిది చేస్తున్నారు.

అయితే తల్లిదండ్రులు వారి పిల్లలు వారి మాట వినాలి అంటే కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించడం వల్ల తల్లిదండ్రులు చెప్పిన విధంగా పిల్లలు మాట వింటారట. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పిల్లలు పడుకున్నప్పుడు తల నైరుతి లేదా దక్షిణ దిశగా ఉండే విధంగా పడుకోబెట్టి నిద్రించే ఏర్పాటు చేయాలి. అలాగే పిల్లల గదిలో అబ్దాన్ని ఉంచకూడదు. ఒకవేళ అద్దం ఉంటే దానిని వస్త్రంతో కప్పి ఉంచాలి. అదేవిధంగా పిల్లల కోసం రొట్టెలు లేదా టిఫిన్ తయారు చేసే సమయంలో శాంతి మంత్రాన్ని పఠించాలి.

పిల్లలు నిద్రించే గది చీకటిగా ఉంచకుండా చూసుకోవాలి. అలాగే ప్రతిరోజు తల్లి పిల్లలకు తేనెను నాకించాలి. పిల్లలకు నల్ల దుస్తులు వేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ వేయాలి అనుకుంటే వీలైనంతవరకు తక్కువగా ధరింప చేయాలి. అదేవిధంగా పౌర్ణమి నాడు వెన్నెల పడే ప్రదేశంలో పిల్లలకుతీపి పదార్థాన్ని తినిపించాలి. అదేవిధంగా పిల్లలు నిద్రించేముందు కౌగిలించుకొని పడుకోబెట్టాడు. అలాగే ఉదయం పిల్లలు నిద్రలేచేటప్పుడు తలని నిమురుతో నిద్రలేపాలి. ఈ వాస్తు చిట్కాలను పాటించడానికి ద్వారా పిల్లలు ఈ మాట వినేలా చేసుకోవచ్చు.