Money : డబ్బున్నవారికి ఎలాంటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా..?

మన బతుకేంది ఇలా ఏడ్చింది...జీవితం డబ్బు లేకుండా ఇలా ఉందేంటి అంటూ బాధపడుతుంటారు చాలా మంది. కానీ నిజానికి డబ్బున్నవారికి ఎన్నో సమస్యలు తప్పవట. డబ్బున్నవాళ్లు ఎదుర్కొనే సమస్యలేంటో తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 11:00 AM IST

మన బతుకేంది ఇలా ఏడ్చింది…జీవితం డబ్బు లేకుండా ఇలా ఉందేంటి అంటూ బాధపడుతుంటారు చాలా మంది. కానీ నిజానికి డబ్బున్నవారికి ఎన్నో సమస్యలు తప్పవట. డబ్బున్నవాళ్లు ఎదుర్కొనే సమస్యలేంటో తెలుసుకుందాం.

మీ మనసుకు విశ్రాంతినివ్వదు:
డబ్బు ఉన్నొళ్లకు మనశ్శాంతి కరువైతుందట. ఎప్పుడు ఒత్తిడితోనే ఉంటారట. వారి ఆర్థిక పరిస్థితిని కాపాడుకునేందుకు చాలా ఒత్తిడిని ఎదుర్కొవల్సి వస్తుందుట. ఆ డబ్బును ఎలా కాపాడుకోవాలి…లేదంటే…ఎలాంటి నష్టం వస్తుంది…ఏ విధమైన నష్టం వస్తుంది…డబ్బును మరింత సంపాదించడం ఎలా…ఇవే ఆలోచనలు వారిలో మెదులుతుంటాయి. ఇక డబ్బు సంపాదనలో పడి…కుటుంబాన్ని పట్టించుకోరట. తాము ధనవంతులమని తెలిసేలా..ఇంట్లో వస్తువులను అమర్చడం లాంటివి చేస్తే లేనిపోని ఒత్తిడికి లోనవుతారట. పేదవారు డబ్బు కోసం పోరాడుతుంటే…ఉన్నోడి పోరాటం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది.

ప్రైవసీ అనేది అసలు ఉండదు:
డబ్బు సంపాదించి…మిలినియర్లుగా మారిన తర్వాత…ఏదో ఒక విధంగా ప్రసిద్ధి చెందుతారు. ఒకసారి పాపులారిటీ వచ్చిన తర్వాత…వారికి ప్రైవసీ కరువవుతుంది. ఎక్కడికి వెళ్లినా ఫొటోలు…చిన్న తప్పు పెద్దదిగా చేస్తారు…ఈ క్రమంలో మిలియనర్లు తమ జీవితాన్ని గుట్టుగా కాపాడుకోలేరు. ప్రశాంతంగా ఎక్కడికి వెళ్లలేరు. ప్రైవసీ అనేదే ఉండదు.

ఆందోళనకరంగా భద్రత:
మిలియనీర్లు…తమతోపాటు తమ కుటుంబ భద్రతపై ఎక్కువగా ద్రుష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎటు నుంచి అపాయం వస్తుందో అని భయపడుతుంటారు. వారికి భద్రత చాలా అవసరం. వారి పిల్లలకు పర్యవేక్షణ అవసరం. దీని గురించి మిలియనీర్లు అన్ని సమాయాల్లో అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.

గోప్యత:
డబ్బున్న వ్యక్తులు తరచుగా సీక్రెట్స్ మెయిటైన్ చేస్తుండాలి. తమ సంపద గురించి ఎవరికి చెప్పలేరు. వారి అడ్రెస్ షేర్ చేసుకున్నా సమస్యే. చాలామంది మిలియనీర్లు తమ సెలవులు, వారి షాపింగ్ గురించి చాలా నిశ్శబ్దంగా ఉండాల్సి వస్తుంది.

విమర్శలు:
మీరు చాలా ఫేమస్ గా మారి…మీ గోప్యతను కోల్పోయినప్పుడు…మీరు విమర్శలకు గురవుతారు. మిమ్మల్ని అందరూ విమర్శిస్తారు. మీరు చేసింది తప్పొ, ఒప్పో అని ప్రతి ఒక్కరూ మిమ్నల్ని నిర్ణయిస్తుంటారు. మీ గురించి అర్థం లేని ఆరోపణలు చేస్తుంటారు. ఈక్రమంలో ప్రతిఒక్కరూ చేసే విమర్శలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి.