Site icon HashtagU Telugu

‎Kidney Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు ప్రమాదంలో పడ్డట్టే.. జాగ్రత్త!

Kidney Health

Kidney Health

‎Kidney Health: మన శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. ఇవి బాగా ఉన్నంత వరకు పర్లేదు కానీ వీటి పనితీరు దెబ్బ తింటే మాత్రం శరీరంపై ప్రభావం పడుతుందట. అయితే కిడ్నీల పనితీరు దెబ్బతింది అన్న విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా ముందే గమనించవచ్చట. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన శరీరంలో ఉన్న రెండు మూత్రపిండాలు నిరంతరం శ్రమిస్తూ, రక్తం నుండి విషపదార్థాలు, అదనపు నీటిని తొలగిస్తాయి. అలాగే రక్తపోటు నియంత్రణ, ఖనిజాల సమతుల్యత, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.

‎ అయితే ఇవి సరిగా పనిచేయకపోతే శరీరం లోపల విషపదార్థాలు పేరుకుపోతాయన్న విషయం తెలిసిందే. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట. అయితే వాటిని తొందరగా గుర్తించడం అత్యంత అవసరం అని చెబుతున్నారు. మూత్రపిండాల సమస్యలు మొదట తేలికపాటి లక్షణాలతోనే కనిపిస్తాయట. అందులో మొదటిది అలసట, బలహీనత. శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతే అలసట ఎక్కువగా ఉంటుంది. రాత్రంతా నిద్రపోయినా శక్తిలేకుండా అనిపిస్తే, ఇది మూత్రపిండాల పనితీరు తగ్గుతున్న సూచనగా భావించాలట. వాపు.. మూత్రపిండాలు అదనపు ద్రవాన్ని తొలగించలేకపోతే పాదాలు, చేతులు, ముఖం వద్ద వాపు కనిపిస్తుందని చెబుతున్నారు. అలాగే మూత్రంలో మార్పులు.

‎మూత్రం రంగు ముదురు కావడం, నురుగు లేదా బుడగలు రావడం, తరచుగా మూత్రవిసర్జన అవసరం కావడం, మంట అనిపించడం వంటి లక్షణాలు మూత్రపిండాల సమస్యను సూచిస్తాయని చెబుతున్నారు. అలాగే శ్వాసలో ఇబ్బంది. మూత్రపిండాలు ద్రవాన్ని ఫిల్టర్ చేయకపోతే, అది ఊపిరితిత్తుల్లో చేరి శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుందట. ఇది మూత్ర పిండాల సమస్య భావించాలని చెబుతున్నారు. రక్తంలో ఖనిజాల అసమతుల్యత ఏర్పడినప్పుడు చర్మం పొడిబారుతుందట. దురదగా మారుతుందని ఇది సాధారణంగా కిడ్నీ వ్యాధి తుదిదశల్లో కనిపించే లక్షణం అని చెబుతున్నారు. పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.

Exit mobile version