Women Health : మహిళలూ..మీ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!!

ఇంటిపనులు, ఉద్యోగం, పిల్లలు, ఇలా ఎన్నో పనులతో మహిళలు నిత్యం బిజీగా ఉంటారు. సమయానికి ఆహారాన్ని తీసుకోరు. పని ఒత్తిడితో అలసిపోతుంటారు.

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 07:00 PM IST

ఇంటిపనులు, ఉద్యోగం, పిల్లలు, ఇలా ఎన్నో పనులతో మహిళలు నిత్యం బిజీగా ఉంటారు. సమయానికి ఆహారాన్ని తీసుకోరు. పని ఒత్తిడితో అలసిపోతుంటారు. తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించరు. అలాంటి సమయాల్లో మహిళలు తమ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఎందుకంటే వయస్సు పెరుగుతున్నా కొద్ది అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడకుండా ఉండాలంటే మహిళలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. వారు బాగుంటే వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది. మరి డైట్ ఈ విటమిన్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. అవేంటో ఓ సారి చూద్దం.

ఈ 6 విటమిన్లు ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవాలి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. మెటబాలిజంను పొందవచ్చు. ఎముకలు ఆరోగ్యవంతంగా బలంగా ఉంటాయి.

ఐరన్:
ఐరన్ ని తప్పకుండా మహిళలు డైట్ లో తీసుకోవాలి. శరీరమంతటికీ ఆక్సిజన్ సరిగా సప్లై అవ్వడానికి ఐరన్ ఎంతో సహాయం చేస్తుంది.

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు: పండ్లు, ఆకుకూరలు, గింజలు

బీ12 :
ఇది శక్తిని వ్రుద్ధి చేస్తుంది అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కి ఎంతో సహాయపడుతుంది. నరాలు సరిగ్గా ఉండేలా చేస్తుంది.

తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు: మాంసం, గుడ్లు, పాలు, చీజ్, బాదం.

బయోటిన్:
బయోటిన్ జుట్టు కి చర్మానికి గోళ్ళ కి ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలను తొలగించడమే కాదు కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యాన్ని కూడా చక్కపెడుతుంది.

తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు:
గింజలు
నట్స్
చిలకడదుంపలు
మష్రూమ్స్
అరటిపండ్లు
బ్రోకలీ

క్యాల్షియం:
క్యాల్షియం గురించి కొత్తగా చెప్పేదేమీ ఉండదు. ఎముకల ఆరోగ్యానికి కూడా కాల్షియం ఎంతో అవసరం.
తీసుకోవాల్సిన ఆహారపదార్ధాలు:
పాలు
టోఫు
చియా సీడ్స్
తోటకూర
బాదం
సోయాబీన్స్

మెగ్నీషియం:
మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:
తోటకూర
డార్క్ చాక్లెట్
బాదం
బ్రౌన్ రైస్
అరటి పండ్లు

విటమిన్ డి:
ఆరోగ్యకరమైన దంతాలకు అవసరం. కార్డియో వాస్క్యూలర్ తోపాటు ఎముకలకు కూడా మంచిది.

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:
చేప
గుడ్లు
ఫోర్టిఫైడ్ మిల్క్
కమలారసం
టోఫు