Vastu Tips: వాస్తు చిట్కాలతో డబ్బునే కాదండోయ్ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకోవచ్చట.. ఎలా అంటే?

సాధారణంగా మనం ఏదైనా పని చేయాలి అన్న ఏదైనా విజయం సాధించాలి అన్న మనపై మనకు విశ్వాసం ఉండాలి.

  • Written By:
  • Publish Date - November 8, 2022 / 09:30 AM IST

సాధారణంగా మనం ఏదైనా పని చేయాలి అన్న ఏదైనా విజయం సాధించాలి అన్న మనపై మనకు విశ్వాసం ఉండాలి. మనపై మనకు విశ్వాసం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఆత్మవిశ్వాసం మనలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం కోసం వాస్తు ప్రకారం గా కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు ప్రకారంగా ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. ఐదు నిమిషాల పాటు రెండు చేతులతో సూర్యుని నమస్కరిస్తూ ధ్యానం చేయాలి.

అలాగే క్రమం తప్పకుండా ఆదిత్య స్తోత్రం పాటించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఆదివారం రోజు తెల్లవారుజామున లేచి సూర్య భగవానునికి నమస్కరించి ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత స్వీట్ తినాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే వాస్తు ప్రకారం గా మీ గదిని ఉదయించే సూర్యుడు లేదా దూసుకెళ్తున్న గుర్రం లాంటి చిత్రాలతో అలంకరించండి. అయితే గుర్రం ఫోటో పెట్టినప్పుడు గుర్రం ఇంటి లోపలికి పరిగెడుతున్నట్లు ఉండే విధంగా అమర్చుకోవాలి. ఎప్పుడూ కూడా ఖాళీ గోడకు ఎదురుగా కూర్చోకూడదు.

అలా కూర్చోవడం వల్ల అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అలాగే వాస్తు ప్రకారం ఎప్పుడూ మీరు మీ ఇంటికి కిటికీలు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వ్యాపింస్తుంది. అలాగే మీ ఇంటి దగ్గర తూర్పు దిశలో ప్రొద్దుటూరు పువ్వు మొక్కను ఉంచడం వల్ల మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఆ మొక్క ప్రభావంతంగా పనిచేస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం గాయత్రి మంతాన్ని జపించండి. ఈ గాయత్రి మంతాన్ని జపిస్తున్న సమయంలో మీ వెనుక ఒక పర్వతం ఉన్న చిత్రాన్ని ఉంచండి. అలాగే శని దేవుని యంత్రాన్ని ఇంట్లో ఉంచి గుమ్మానికి నిమ్మకాయ పచ్చిమిరపకాయలను వేలాడ దీయాలి. అయితే ఆ నిమ్మకాయను కేవలం శనివారం మాత్రమే తీసి మళ్లీ దానికి స్థానంలో మరొకటి ఉంచాలి. కుడి చేతి ఉంగరపు వేలికి బంగారు ఉంగరాన్ని ధరించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మీ లక్ష్యాన్ని సులభంగా సాధించగలుగుతారు.