ముఖం అందంగా కనిపించాలి అంటే ముఖ్యంగా అందమైన కనుబొమ్మలు ఉండాలి. కనుబొమ్మలు అందంగా ఉంటేనే ముఖం మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. లేదంటే కనుబొమ్మలు లేకపోతే ముఖం చూడడానికి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా ఉన్నప్పుడే ముఖం కళగా ఉంటుంది. అయితే కొంతమందికి కనుబొమ్మలు పలుచగా ఉంటాయి. మరికొందరికి గ్యాప్ గ్యాప్ తో అస్సలు సరిగా కనిపించకుండా ఉంటాయి. అందమైన కనుబొమ్మల కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అందమైన కనుబొమ్మలు కావాలనుకుంటున్నారా. అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాలిందే.
కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే.. ఆముదం ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. కనుబొమ్మలు కావాలంటే రోజూ కాస్తంత ఆముదాన్ని నిద్రపోయే ముందు కనుబొమ్మల చుట్టూ రాయాలి. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. రాత్రి నానబెట్టిన మెంతుల్ని ఉదయాన్నే పేస్ట్ చేసి కనుబొమ్మలపై రాయాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఒత్తైన కనుబొమ్మలనను మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే స్పూను తాజా ఉల్లిరసానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి, దూదితో కనుబొమల ప్రాంతంలో రాసి, ఆరనివ్వాలి. పావు గంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరి. కొంచెం ఘాటు ఉంటుంది. జాగ్రత్తగా రాసుకోవాలి. ప్రతి రెండు రోజులకోసారి ప్రయత్నించాలి. ఉల్లిపాయలో సల్ఫర్ అధిక మొత్తంలో ఉంటుంది.
కాబట్టి అదికరక్త ప్రసరణ బాగా జరిగేలా ప్రేరేపిస్తుంది. కను బొమ్మలు ఒత్తుగా పెరగడానికి కలబంద కూడా సహకరిస్తుంది. అలోవెరా చెక్కు తీసి నేరుగా కనుబొమలను రుద్ది, ఆరనిచ్చి కడిగినా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కొబ్బరి నూనె తరచూ అప్లై చేయడం వల్ల కూడా కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. పాలల్లో ముంచిన దూదితో కనుబొమలపై అద్దాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేయాలి. పాలలో తేనె యాడ్ చేసి అప్లై చేసినా మంచి రిజల్ట్స్ ఉంటాయి. విటమిన్ లోపం వల్ల కూడా వెంట్రుకల ఎదుగుదల ఆగిపోతుంది.