Avoid These After Meals: భోజనం తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?

చాలామంది భోజనం చేసిన తర్వాత భోజనానికి ముందు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయితే అలా

  • Written By:
  • Publish Date - August 12, 2022 / 06:30 AM IST

చాలామంది భోజనం చేసిన తర్వాత భోజనానికి ముందు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయితే అలా తెలిసి తెలియక చేసే తప్పులు వల్లే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అయితే భోజనం చేసిన తర్వాత కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయట. మరి భోజనం చేసిన తర్వాత ఇటువంటి పనులు చేయకూడదు. అలా చేయకూడని పనులు చేయడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసింది. ఈ ధూమపానం చేయడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అని తెలిసి కూడా అలాగే చేస్తూ ఉంటారు.

అయితే భోజనం చేసిన తర్వాత ధూమపానం చేస్తే అది ఒక పది సిగరెట్ లు తాగిన దాంతో సమానం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తిన్న తర్వాత వెంటనే ఎప్పుడు నిద్ర పోకూడదు. అలా చేయడం వల్ల కడుపులో గ్యాస్ ట్రబుల్ ఏర్పడుతుంది. చాలామంది తిన్న తర్వాత కాఫీ టీలు లాంటివి తాగుతూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల మలవిసర్జన సమస్యలు ఎదురవుతాయి. ఒకవేళ తాగాలి అనుకునేవారు తిన్న తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత తాగడం మేలు. తిన్న వెంటనే చాలామంది స్నానం చేస్తూ ఉంటారు. ఇలా తిన్న పెట్టిన స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ తగ్గుతుంది.

అంతేకాకుండా విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే తిన్న తర్వాత స్నానానికి ఒక కనీసం ఒక 30 నిమిషాలు అయినా గ్యాప్ ఇవ్వాలి. అన్నం తిన్న తర్వాత చాలామంది తిన్నది అరగడం కోసం పండ్లు తింటూ ఉంటారు. అయితే పండ్లు తినడం వల్ల అరగడానికి చాలా సమయం పడుతుంది. తద్వారా గుండెల్లో మంట పుడుతుంది. భోజనం చేసిన తర్వాత కడుపు బిగుతుగా ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడు బెల్ట్ ని లూస్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా బెల్ట్ ని ఎప్పుడు లూజ్ చేయకూడదట. తిన్న తర్వాత చాలామంది చాలా నీరు తాగుతూ ఉంటారు. ఇలా తిన్న వెంటనే చల్లని నీరు తాగకూడదట. ఇలా చేయడం వల్ల ఆహారం గడ్డ కడుతుంది. ద్వారా కడుపు నొప్పి వస్తుంది. అలాగే నిద్రపోయే ముందు బ్రష్ చేయడం మంచిది. అలా అని తిన్న వెంటనే బ్రష్ చేయకుండా గంట అరగంట సమయం తర్వాత చేయడం మంచిది.