Vastu Tips: రాత్రి వేళ నిద్రపోయేటపుడు చాలామందికి కొన్ని వస్తువులను పక్కనే లేదా తలకింద పెట్టుకునే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా మొబైల్, వాటర్ బాటిల్. తలకింద మొబైల్, పక్కనే లేదా మంచం కింద వాటర్ బాటిల్ పెట్టుకుని పడుకుంటారు. వాస్తు ప్రకారం వాటిని అలా పెట్టుకోకూడదని వాస్తునిపుణులు సూచిస్తున్నారు. ఇవి జీవితంపై ప్రతికూల ప్రభావాలని చూపుతాయట.
రాత్రివేళ నిద్రించేటపుడు తలకింద నీరు పెట్టుకోకూడదు. అలా చేస్తే చంద్రుడు బాధపడతాడు. ఫలితంగా ఇంట్లో ప్రతికూలతలు, మానసిక సమస్యలు రావొచ్చు. గొంతెండిపోయే సమస్యలున్నవారు, మధ్యరాత్రిలో నీరు తాగే అలవాటున్నవారు మంచినీటిని కాళ్లవైపు పెట్టుకోవడం మంచిది.
ఫోన్ లేకపోతే జీవితమే లేదన్నట్లుగా స్మార్ట్ ఫోన్లకు అలవాటుపడ్డారు. పడుకునేటపుడు ఖచ్చితంగా తల దిండుకింద మొబైల్ పెట్టుకునే అలవాటు నూటికి 90 శాతం మందికి ఉంటుంది. కొందరైతే స్మార్ట్ వాచ్ తో అలాగే నిద్రపోతారు కూడా. కానీ.. పడుకునే సమయంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను ఇలా పెట్టుకోకూడదు. అది ధననష్టంతో పాటు.. జీవితంలో ప్రతి రంగంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
అలాగే.. ఒకసారి వేసుకున్న దుస్తుల్ని మళ్లీ వేసుకున్నాక వాష్ చేయొచ్చని వాటిని హ్యాంగర్ కు తగిలిస్తారు. లేదా సోఫాలు, కుర్చీల్లో పడేస్తారు. బెడ్రూమ్ లో ఇలా మురికి బట్టలు ఉండటం వల్ల పీడకలలు వస్తాయట. అంతేకాదు ప్రతికూల శక్తిని కూడా ఆకర్షిస్తాయి.
పడుకునేటపుడు బంగారాన్ని కూడా దిండుకింద పెట్టుకోకూడదు. ఇవి కూడా ప్రతికూలతను పెంచుతాయి. జీవిత భాగస్వామితో సంబంధం చెడిపోవచ్చు. అనేక అడ్డంకులు కూడా రావొచ్చు.
బెడ్రూమ్ లో అద్దం కనిపించేలా మంచం ఉండకూడదు. ఇది వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అలాగే పడున్నపుడు అద్దంలో చూసుకోకూడదు. ఇవి పీడకలలను ప్రేరేపిస్తాయి. నిద్రలేవగానే కూడా అద్దంలో ముఖం చూసుకోవడం మంచిది కాదు.
కొందరికి పడుకునేటపుడు పుస్తకాలు చదవడం అలవాటు. కానీ వాటిని దిండు కింద పెట్టుకుని పడుకోకూడదు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పెరుగుతుంది.
అలాగే వెహికల్స్ తాళాలు, పర్సులు, డబ్బులు కూడా దిండు కింద పెట్టుకోకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం దూరమవుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.