Beauty Tips: మచ్చలేని అందమైన చర్మం కావాలా.. అయితే ఈ సూప్స్ తాగాల్సిందే?

మామూలుగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా మచ్చలేని అందమైన చర్మం కావాలని కోరుతూ ఉంటుంది. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. బ్యూటీ

  • Written By:
  • Publish Date - February 11, 2024 / 11:37 AM IST

మామూలుగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా మచ్చలేని అందమైన చర్మం కావాలని కోరుతూ ఉంటుంది. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడంతో పాటు, వేలకు వేలు పెట్టి బ్యూటీ ప్రోడక్ట్ లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే మీరు కూడా ముఖంపై మొటిమలు నల్లటి మచ్చలు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కొన్ని సూప్స్ తాగాల్సిందే.
సూప్స్‌ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండటానికి అవసరమైన పోషకాలు మనకు అందుతాయి. సూప్‌లు ఆహారంలో చేర్చుకుంటే చర్మాన్ని తేమగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

శరీరాన్ని డీటాక్స్‌ చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తుంది. మీ సౌందర్యాన్ని సంరక్షించుకోవడానికి ఎలాంటి సూప్స్‌ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యాబేజీ సూప్‌లో యాంటీ ఆక్సిడెంట్‌ లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. క్యాబేజీ లోని విటమిన్‌ సి కంటెంట్‌ చర్మాన్ని సూన్నితంగా ఉంచుతుంది, కొల్లాజెన్‌ ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ఇది చర్మాన్ని తేమగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. టమాటాలో లైకోపీన్‌ ఉంటుంది. ఇది చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. ముడతలు, గీతలను నివారిస్తుంది. ఇందులో అధికంగా ఉండే విటమిన్‌ సి, ఏ కంటెంట్‌ స్పాట్‌లెస్‌ బ్యూటీని అందిస్తుంది, చర్మంపై మచ్చలను నివారిస్తుంది. మీ ఛాయను మెరుగుపరుస్తుంది.

చిలగడదుంప చర్మాన్ని రక్షించే సూపర్‌ ఫుడ్‌. చిలగడదుండలో బీటా, కెరోటిన్‌ ఉంటుంది. ఇది చర్మం సహజ గ్లోను మెరుగుపరుస్తుంది. యూవీ కిరణాల నుంచి చర్మ కణాలను రక్షిస్తుంది. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు క్లియర్‌, హెల్తీ స్కిన్‌ను ప్రోత్సహిస్తాయి. గుమ్మడి కాయ సూప్‌లో బీటా కెరోటిన్‌, విటమిన్‌ ఇ, సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతాయి. విటమన్‌ సి, ఏ, ఇ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. గుమ్మడికాయ లోని హైడ్రేషన్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యకరమైన ఛాయను ప్రోత్సహిస్తుంది. మెరిసే చర్మం కోసం మీ డైట్‌లో గుమ్మడికాయ సూప్‌ తీసుకోవడం మంచిది. బీట్‌రూట్‌ సూప్‌ యాంటీ ఏజింగ్‌ సూపర్‌ ఫుడ్‌. ఇందులోని యాంటీఆక్సిడెంట్‌ కంటెంట్‌ సహజ ప్రకాశాన్ని మెరుగుపరుస్తుంది, ఇవి చర్మకణాలను రిపేర్‌ చేస్తాయి. దీనిలోని ఫోలేట్‌ చర్మ కణాలను పునరుద్ధరణలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో ఐరన్‌ విటమిన్లు ఉంటాయి.. ఇవి శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో క్లియర్‌, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.