Site icon HashtagU Telugu

Life Situations: జీవితంలో ఈ సందర్భాలు అస్సలు రాకుండా చూసుకోవాలి.. అవి ఏంటంటే?

Life

Life

మనిషి జీవితం నీటి మీద బుడగ లాంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో చెప్పడం చాలా కష్టం. మనిషి చనిపోయేలోపు తన జీవితంలో కష్టాలను సుఖాలను అనుభవించాలి. చాలా మంది చనిపోయేలోపు ఒక్కసారి అయినా అలా బతకాలి ఇలా బతకాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకొందరు మాత్రం లైఫ్ లో పెద్ద పెద్ద ఆశలు, సంతోషాలు లేక పోయిన కష్టాలు ఉండకూడదు అని కోరుకుంటూ వుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి కోరుకుంటూ ఉంటారు. ఇది చాలామంది జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎదురుకాకూడదు అని కోరుకుంటూ ఉంటారు.

మరి జీవితంలో రాకూడని ఆ ఐదు సందర్భాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే మన జీవితంలో మనం దూరం చేసుకోవాల్సిన 5 సందర్భాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇక అందులో మొదటిది సహాయం కోసం అందరి ముందు చేతులు చాచడం.. ఇలా అందరి దగ్గర సహాయం కోసం చేతులు సందర్భాలు రాకూడదు. ఇక రెండవది జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం.. చాలామంది వారి జీవితంలో కొద్ది రకాల మార్పులు రాగానే వెంటనే భయపడుతూ ఉంటారు. అలా భయపడకుండా మార్పులను కూడా చిరునవ్వుతో ఆనందిస్తూ వాటిని అధిగమించాలి.

ఇక మూడవది గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం.. అయితే ఎప్పుడు జరిగిన విషయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండడం కంటే విషయాలను తలచుకొని జాగ్రత్త పడటం ముఖ్యం. ఇక నాలుగవది మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తి కూడా మన పట్ల చిన్నచూపు చూస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఐదవది చిన్న విషయానికి అతిగా ఆలోచించడం. అన్ని చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు.

Exit mobile version