Site icon HashtagU Telugu

Hair Care: పలుచని జుట్టుతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలను పాటించండి?

Hair Care

Hair Care

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది జుట్టు ఊడిపోవడం సమస్యతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా పురుషులు జుట్టు ఊడిపోయి పలచగా అయిపోవడం లేదంటే బట్టతల రావడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది స్త్రీలు ఎక్కువ శాతం హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల పలుచని జుట్టుతో బాధపడుతున్నారు. హెయిర్ ఫాల్ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒత్తిడి, ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, కాలుష్యం, పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యల కారణం ఇలా ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి హెయిర్‌ ఫాల్‌ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పలుచబడి నుదురు కనిపిస్తూ ఉంటుంది.

దీని కారణంగా వారి కాన్ఫిడెన్స్‌ దెబ్బ తింటూ ఉంటుంది. మరి పలుచని జుట్టుతో బాధపడుతున్న వారు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరగాలంటే.. విటమిన్లు, మినరల్స్‌, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. మీ డైట్‌లో ఆకు కూరలు, గుడ్లు, చేపలు, నట్స్‌, విత్తనాలు, పండ్లను చేర్చుకోవాలి. హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి మీ స్కాల్ప్‌ను క్రమం తప్పకుండా మసాజ్ చేయాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ప్రతి రోజు 15 నిమిషాల పాటు మీ తలను వేళ్లతో సున్నితంగా మసాజ్‌ చేయాలి. మసాజ్‌ హెయిర్‌ ఫాలికల్స్‌ను ఉత్తేజపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది.

కాబట్టి ఒత్త్తెన జుట్టు కావాలంటే ఉల్లిరసం తీసుకొని కుదుళ్ల వద్ద మృదువుగా మర్దన చేయాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనిచ్చి మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.​ గుడ్లలో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టుకు పోషణ అందిస్తాయి, జుట్టు రాలే సమస్యలను దూరం చేస్తాయి. కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకొని బాగా గిలక్కొట్టాలి. దానిని కుదుళ్లకు చేరేలా పట్టించి 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీరు, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికోసారి క్రమం తప్పకుండా చేయాలి. అలా చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడవచ్చు. కొబ్బరి పాలు.. కొబ్బరి పాలు జుట్టు సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. కొబ్బరిపాలలో క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ ఎ, సి, ఇ, సహజ ప్రొటీన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

తాజా కొబ్బరి పాలను తలకు అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం మంచిది. కలబంద జుట్టుకు పోషణ అందించి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కలబంద తలలో pH ని సమతుల్యం చేస్తుంది, ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. తాజా కలబంద గుజ్జును జుట్టుకు, కుదుళ్లకు అప్లై చేసి 30 నుంచి 40 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Exit mobile version