Site icon HashtagU Telugu

Winter Hair Care: పొడిబారిన జుట్టు ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ ప్యాక్ ట్రై చేయాల్సిందే?

Mixcollage 09 Feb 2024 07 19 Pm 9094

Mixcollage 09 Feb 2024 07 19 Pm 9094

శీతాకాలంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య పొడిజుట్టు. చల్లటి గాలులు, తేమ పొగ మంచు వంటి వాటి వల్ల జుట్టు పొడిబారుతూ ఉంటుంది. దాంతో జుట్టు నిర్జీవంగా మారడం, చివర్ల చిట్లిపోవడం వంటి సమస్యలు ఎదురువుతాయి. సహజసిద్ధంగానే పొడితత్వం ఉండే జుట్టు ఉన్నవారు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని నేచురల్ ప్యాక్స్ ట్రై చేస్తే చాలు. పట్టు లాంటి ఒత్తైన దృడమైన జుట్టు మీ సొంతం. మరి ఇందుకోసం ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే.. మీ జుట్టు పొడిబారితే బాగా పండిన ఒక అరటిపండు తీసుకొని దానిని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేసుకొని కండిషనర్ రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పట్టులాంటి జుట్టు మీ సొంతం అవుతుంది.

మరొక రెమిడీ విషయానికి వస్తే.. గుడ్డులోని తెల్ల సొనకు రెండు చెంచాల చొప్పున శనగపిండి, బాదం పొడి, తగినంత గులాబీనీరు కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట ఆగి, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది. అదేవిధంగా గుమ్మడికాయ మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. గుమ్మడికాయలోని విటమిన్‌ ఎ, సిలతో పాటు బీటాకెరోటిన్, జింక్, పొటాషియం మీ జుట్టును హెల్తీగా ఉంచుతాయి. కొద్దిగా గుమ్మడికాయ పేస్ట్ తీసుకొని అందులో రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసి 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేసి మంచి కండిషనర్ అప్త్లె చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా కురులు మృదువుగా, పట్టులా మారతాయి.

జుట్టు పొడిబారకుండా ఉండాలి అంటే రెండు చెంచాల మెంతిపిండికి నాలుగు చెంచాల కొబ్బరిపాలను కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని మాడుకి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. గంట తర్వాత గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది. గంజిలో బి, ఇ, సి విటమిన్లు ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణనిచ్చి ఆరోగ్యంగా మారుస్తాయి. గంజికి కాస్త మజ్జిగ కలిపి తలకు పట్టించి అరగంట ఆరనివ్వాలి. ఆపై తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే కుదుళ్లు బలపడతాయి.