Site icon HashtagU Telugu

Morning Drinks: ఉదయం సమయంలో ఈ డ్రింక్స్ తాగితే చాలు.. ఆ సమస్యలన్నీ మటుమాయం?

Morning Drinks

Morning Drinks

ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్యులు చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌, డయాబెటిస్‌, ఎసిడిటీ వంటి అనేక రకరకాల సమస్యలు పరిష్కరించబడతాయి. అందుకోసం మార్నింగ్ సమయంలో ఎటువంటి డ్రింక్స్ తాగాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మెంతులలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మెంతులలో రైబోఫ్లావిన్‌, కాపర్‌, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, ఫోలిక్‌ యాసిడ్‌తో పాటుగా విటమిన్‌ ఎ, బి6, సి, కె వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డయాబెటిక్‌ పేషెంట్స్‌, టైప్‌ – 2 డయాబెటిస్‌ను నివారించిడానికి మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం మంచిది. మెంతులలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలు గ్యాస్ట్రిక్, ఎసిడిటీ జీర్ణ సంబంధిత సమస్యలు. ఈ సమస్యను నివారించడానికి కొన్ని కిస్‌మిస్‌లను నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లు తాగి, కిస్‌మిస్‌ నమిలి తినండి. కిస్‌మిస్‌లో క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, సి-విటమిన్‌ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఉదయం పూట ఈ నీళ్లు తాగితే హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది, రక్తహీనత తగ్గుతుంది. పైల్స్‌ సమస్య దూరం అవుతుంది. అలాగే చియా సీడ్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, కరిగే ఫైబర్‌, ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్‌లోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ ఎముకల ఆరోగ్యాన్నికి మేలు చేస్తాయి. ఇది ఆస్టియోపోరోసిస్‌ సమస్యను నివారిస్తుంది. ఒక స్పూన్‌ చియా సీడ్స్‌ను గ్లాస్‌ వాటర్‌లో వేసి కొంత సేపు నానబెట్టండి, ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగండి. చియా సీడ్స్‌లోని ఫైబర్, ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. అలాగే అలీవ్‌ గింజలను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం పూట ఆ నీళ్లు తాగండి. రోజూ ఈ నీళ్లు తాగితే స్ట్రెస్‌ తగ్గుతుంది, సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.

Exit mobile version