మామిడిపండ్లు(Mangoes) అంటే వేసవి(Summer)లో దొరికే పండు దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మామిడిపండ్లలో చాలా రకాలు ఉన్నాయి వాటిలో ఎక్కువ రేటు కూడా ఉన్న మామిడిపండ్లు కూడా ఉంటాయి. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) కిలో 50 నుంచి 100 మహా అయితే 200 వరకు మామిడి పండ్ల రేటు ఉంటుంది. కానీ కొన్ని మామిడిపండ్ల ధరలు వేలల్లో ఉంటాయి. ఓ రకం అయితే లక్ష పైనే ఉంది.
మియాజకి మామిడిపండ్ల(Miyazaki Mango) కిలో ధర రెండు లక్షల నుండి రెండు లక్షల డెబ్బయి వేల వరకు ఉంటుంది. దీనిని జపాన్ లో పండిస్తారు. ఇది చక్కని రంగులో ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని సేంద్రీయ పద్దతిలో పండిస్తారు.
కోహితూర్ మ్యాంగో(Kohitur Mango) దీనిని మన దేశంలోనే పండిస్తారు. ఈ కోహితూర్ మ్యాంగో ఒక్కొక్క మామిడిపండు ధర 1500 రూపాయలు. ఆల్ఫాన్సో మామిడిపండు కిలో విలువ మూడు వందల నుండి నాలుగు వందల వరకు ఉంటుంది. ఇవి మామిడిపండ్లు అన్నింటిలోనూ ఎక్కువ రకానికి చెందినవి. సింధరి మామిడిపండ్లు ఇవి పాకిస్థాన్ లో పండుతాయి. వీటికి అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. సింధరి మామిడిపండ్లు కిలో ధర మూడు వందల నుండి నాలుగు వందల వరకు ఉంటుంది.
మొగల్ సామ్రాజ్య అధినేత జహంగీర్ భార్య అయిన నూర్జహాన్ పేరు మీద కూడా మామిడిపండ్లను పండించారు. నూర్జహాన్ మామిడిపండ్ల ధర ఒక్కొక్కటి ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. ఫిలిప్పీన్స్ లో పండించే కారాబావో మామిడిపండ్ల కిలో ధర రెండు వందల వరకు ఉంటుంది. పైన చెప్పిన అన్ని రకాల మామిడిపండ్లను చల్లని వాతావరణంలో, కొన్ని ప్రత్యేక పద్దతిలో సేంద్రీయంగా పండిస్తారు అందుకే ఈ మామిడిపండ్లు ఎక్కువ ధర ఉంటాయి.
Also Read : Mango Ice Cream : మ్యాంగో ఐస్ క్రీం ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?