Site icon HashtagU Telugu

Beauty Tips: మీ అందం రెట్టింపు అవ్వాలంటే ఈ జ్యూస్ లు తాగాల్సిందే.. అవేంటంటే!

Beauty Tips

Beauty Tips

ఈ రోజుల్లో చర్మ సంరక్షణ కోసం అని మగవారు ఆడవారు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్లిన తర్వాత ఆ అందం కొద్ది రోజులు మాత్రమే. మళ్లీ యధావిధిగా బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిందే. అయితే బ్యూటీ పార్లర్ తో పని లేకుండా తినే ఆహారంపై దృష్టి పెడితే తప్పనిసరిగా మంచి ఫలితాలను చూడవచ్చని చెబుతున్నారు. మరి ముఖ్యంగా మెరిసిపోయే చర్మం మీ సొంతం కావాలంటే మీ అందం రెట్టింపు కావాలంటే కొన్ని రకాల జ్యూస్ లు తాగాలని చెబుతున్నారు. ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు చర్మంలో కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో మీ చర్మం కాంతివంతంగా, తేమగా కనిపిస్తుంది. ఇది కొన్ని చర్మ సమస్యలను కూడా రాకుండా చేస్తుంది. అందుకే ఆరెంజ్ జ్యూస్ ను తరచూ తాగమని చెబుతున్నారు. అలాగే దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయట. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ దానిమ్మ జ్యూస్ ను తరచుగా తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట.

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుందట. అలాగే చర్మ ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. టమాటా జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఒక గ్లాసు టమాటో జ్యూస్ ను తాగడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయట. అలాగే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందట. టమాటా జ్యూస్ మీరు బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే కిడ్నీల సమస్యలతో బాధపడేవారు టమోటా జ్యూస్ తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు. కీరదోసకాయ జ్యూస్ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఈ జ్యూస్ ను తాగితే చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుందట.

అలాగే కాంతివంతంగా కూడా కనిపిస్తుందని చెబుతున్నారు. ఉసిరికాయ జ్యూస్ కూడా చర్మ సంరక్షణకు బాగా సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయ రసాన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుందట. అలాగే మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందట. ఇది మీ జుట్టును కూడా కాపాడుతుందని చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ తాగితే చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు అలాగే గ్లో అవుతుంది. ఈ జ్యూస్ మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.