Juices: మీ స్కిన్ అందంగా మెరిసిపోవాలంటే ఈ జ్యూసులు తాగాల్సిందే?

ఈ రోజుల్లో స్త్రీ,పురుషులు ప్రతి ఒక్కరూ అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. చర్మ సంరక్షణ విష

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 10:30 PM IST

ఈ రోజుల్లో స్త్రీ,పురుషులు ప్రతి ఒక్కరూ అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. చర్మ సంరక్షణ విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అయితే చర్మ సంరక్షణ విషయంలో మనం తినే ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. కొన్ని ఆహారాలు మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. ఇలాంటి వాటిలో కొన్ని ఆహారాలు ఉన్నాయి. కొన్ని రకాల జ్యూసులు తాగడం వల్ల కూడా చర్మాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చు. ఇంతకీ ఆ జ్యూస్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆరెంజ్ జ్యూస్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలుచేస్తుంది. ఈ జ్యూస్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మీ చర్మం కాంతివంతంగా, తేమగా కనిపిస్తుంది. ఇది కొన్ని చర్మ సమస్యలను కూడా రాకుండా చేస్తుంది. అందుకే ఆరెంజ్ జ్యూస్ ను తరచూ తీసుకుంటూ ఉండాలి. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ దానిమ్మ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే టమాటా జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు టమాటో జ్యూస్ ను తాగడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా కీరదోసకాయ జ్యూస్ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఈ జ్యూస్ ను తాగితే చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కాంతివంతంగా కూడా కనిపిస్తుంది.
ఉసిరికాయ జ్యూస్ కూడా చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయ రసాన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇది మీ జుట్టును కూడా కాపాడుతుంది.