Site icon HashtagU Telugu

‎Food For Heart Health: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తినాలో మీకు తెలుసా?

Food For Heart Health

Food For Heart Health

Food For Heart Health: రోజు రోజుకి గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య, గుండెపోటు ఘటనలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అయితే గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉండగా అందులో ఆహారపు అలవాట్లు కూడా ఒకటి. మారుతున్న జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా గుండెపోటుకు కారణమని చెబుతున్నారు. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలకూర, మెంతులు, ఆవాల వంటి ఆకు కూరల్లో నైట్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

‎ఇవి రక్త పోటును తగ్గించడంలో సహాయపడతాయని, ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ ను నియంత్రిస్తుందని చెబుతున్నారు. వాటిలో ఉండే విటమిన్ కె ధమనులను రక్షిస్తుందట. రోజూ ఆకు కూరలు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని చెబుతున్నారు. అలాగే బ్లూ బెర్రీస్ , దానిమ్మ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లకు శక్తి వంతమైనవి. వాటిలోని ఆంథోసైనిన్లు, పాలీఫెనాల్స్ ధమనులలో ఫలకం ఏర్పడటాన్ని తగ్గిస్తాయట. అంతే కాకుండా ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయని, దానిమ్మ జ్యూస్ రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తుందని అంతేకాకుండా అధిక రక్త పోటును కూడా నియంత్రిస్తుందని చెబుతున్నారు.

‎ రోజూ గుప్పెడు వాల్‌ నట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట. వాల్‌ నట్స్‌ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌, వాపును తగ్గిస్తాయని చెబుతున్నారు. అదేవిధంగా గ్రీన్ టీలో కాటెచిన్లు అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ధమనులను సరళంగా ఉంచడంలో అంతే కాకుండా రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయ పడతాయట. బ్లాక్ కాఫీ కూడా గుండెకు మేలు చేస్తుందట. కానీ ఉదయాన్నే తాగాలి. అలాగే మీరు ప్రతి రోజు గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తీసుకుంటే మాత్రం 2 నుంచి 3 కప్పులు మాత్రమే తీసుకోవాలని మితిమీరి అసలు తాగకూడదని చెబుతున్నారు.
‎అలాగే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే అవిస గింజలను కూడా డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు.

Exit mobile version