మామూలుగా చాలామంది స్త్రీ పురుషులకు కళ్ళ చుట్టూ, కళ్ళ కింద నల్లటి వలయాలు ఉంటాయి. దీన్నే డార్క్ సర్కిల్స్ అని అంటుంటారు. ఈ డార్క్ సర్కిల్స్ అనేక రకాల కారణాల వల్ల వస్తూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రాడక్టులు ఉపయోగించడంతో పాటుగా, హోమ్ రెమెడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇంకొందరు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే అలా డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడేవారు కొన్ని హోం రెమిడీలను ఫాలో అవ్వాలని చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే..
టమాటాలు కూడా డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడానికి సహాయపడతాయి. టమాటాలను తింటే రక్త ప్రసరణ పెరుగుతుందట. దీంతో కంటికింది సున్నితమైన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా టమాటాల్లో ఉండే లైకోపీన్ చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. అలాగే డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో కీరదోసకాయలు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. కీరదోసకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఇవి మన చర్మాన్ని పునః ఉత్తేజపరుస్తాయి. కీరదోసకాయ తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుందని చెబుతున్నారు.
అలాగే బొప్పాయి మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే బొప్పాయి వృద్ధాప్య లక్షణాలు అంటే ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బొప్పాయి కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించడానికి సహాయపడతాయి. అలాగే బచ్చలికూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రక్త ప్రసరణను పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ కె సమృద్ధిగా ఉండే ఈ ఆకు కూర చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.