Site icon HashtagU Telugu

Beauty Tips: మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా.. ఈ పువ్వులను ఉపయోగించాల్సిందే?

Mixcollage 18 Feb 2024 05 49 Pm 9028

Mixcollage 18 Feb 2024 05 49 Pm 9028

మామూలుగా ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అందం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించడంతోపాటు అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. హోమ్ రెమిడీలు సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు.. వాటితో పాటుగా కొన్ని రకాల పూలను ఉపయోగించి మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. పూలతో తయారుచేసిన ఫేస్‌ప్యాక్స్‌ అటు పలు చర్మ సమస్యల్ని తగ్గిస్తాయట. చర్మానికి మెరుపును అందిస్తాయి. మీ అందాన్ని పెంచడానికి ఖరీదైన క్రీమ్‌ల కంటే పువ్వులు చాలా బాగా పని చేస్తాయి. గులాబీ పువ్వు దాదాపు ప్రతి ఇంటి గార్డెన్‌లో ఉంటుంది. సౌందర్య పరిరక్షణలో గులాబీలు సహాయపడతాయి.

కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ను దూరం చేయడానికి రోజ్‌ వాటర్‌ యూజ్‌ అవుతాయి. కాటన్‌ రోజ్ వాటర్‌లో ముంచి కళ్ల మీద పెడితే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. గులాబీలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన చర్మంపై వచ్చే దురద, మంట, లాంటి వాటినీ దూరం చేస్తాయి. గులాబీ మంచి క్లెన్సర్‌గా కూడా పని చేస్తుంది. రోజ్‌ వాటర్ మన ముఖంపై ఉన్న జిడ్డుని, పేరుకుపోయిన మురికిని తీసేసి చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. గులాబీ ఫేస్‌ ప్యాక్‌ వేసుకున్నా అదే రిజల్ట్ ఉంటుంది. గులాబీ ట్యాన్‌ని కూడా తొలగిస్తుంది. దీనికోసం కీరా దోస, గులాబీ, గ్లిజరిన్‌లు కలిపిన ప్యాక్‌ని వేసుకుంటే మంచిది. అలాగే లావెండర్ పువ్వులు స్కిన్‌ ఆయిల్‌ను, pH స్థాయిని సమతుల్యం చేస్తాయి. ఇది చర్మం పొడి బారకుండా కాపాడుతుంది. లావెండర్‌ పేస్ మాస్క్.. ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది.

ఈ పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. లావెండర్‌ ఆయిల్‌ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. లావెండర్‍ ఆయిర్ ముఖానికి రాసుకుంటే మంచిది. ఇది ముఖంపై ముడతలను దూరం చేస్తుంది. మొటిమలను రాకుండా రక్షిస్తుంది. చామంతిలో ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది స్కిన్‌ ఎలాస్టిసిటీని నిర్వహిస్తాయి. చర్మం కమిలిపోకుండా కాపాడుతుంది. ఈ పూలను ఎండబెట్టి పొడి చేసి ఫేస్ ప్యాక్ లా ఉపయోగించుకోవచ్చు. అలాగే మందారం పువ్వు లోని విటమిన్‌ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

రెండు చెంచాల మందార రేకల గుజ్జుకి, చెంచా కలబంద గుజ్జు, అరచెంచా ముల్తానీ మట్టి, కాస్త రోజ్‌వాటర్‌ కలిపి ముఖం, మెడ, చేతులకు ప్యాక్‌ వేసుకోవాలి. పావుగంటయ్యాక శుభ్రం చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది. ఈ పువ్వులు చర్మాన్ని ఏజింగ్‌ నుంచి కాపాడుతుంది, స్కిన్‌ ఆయిల్ మేయిన్‌టేన్ చేస్తుంది. సుగంధాలు వెదజల్లే మల్లె పువ్వులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మల్లె పూలు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. వీటిని ఎన్నో సౌందర్య ఉత్పత్తులలో వాడతారు. ముఖానికి తేమను అందించి మెరిపించే గుణాలు మల్లెలో ఉన్నాయి. గుప్పెడు మల్లెలను పేస్టులా చేసి, అందులో చెంచా కొబ్బరినూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట సేపు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.