Site icon HashtagU Telugu

Hair Fall Control Tips: జుట్టు ఎక్కువగా రాలుతోందా.. అయితే ఈ 5 రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే?

Mixcollage 17 Jan 2024 03 45 Pm 1804

Mixcollage 17 Jan 2024 03 45 Pm 1804

ప్రస్తుత రోజుల్లో జుట్టు ఎక్కువగా రాలిపోవడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీని కారణంగా చాలామంది పొట్టి జుట్టు, పలుచని జుట్టు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అధికంగా హెయిర్ ఫాల్ అవుతుంటే అలాంటి సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరి జుట్టు ఎక్కువగా రాలుతుంటే అలాంటప్పుడు ఎటువంటి చిట్కాలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జుట్టు రాలే సమస్యను వెంటనే పరిష్కరించడానికి సమతుల్య, పోషకాహార తీసుకోవాలి.

విటమిన్లు, మినరల్స్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్‌తో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాహార లోపం హెయిర్‌ ఫాల్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా ఐరన్, జింక్, విటమిన్ ఎ, డి లోపం కారణంగా జుట్టు రాలుతుంది. మీ డైట్‌లో రకరకాల పండ్లు, కూరగాయలు, లీన్‌ ప్రొటీన్లు, తృణధాన్యాలు చేర్చండి. పాలకూర, గుడ్లు, నట్స్‌, విత్తనాలు, చేపలు మీ ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. హెయిర్‌ ఫాల్‌ను కంట్రోల్‌ చేయడానికి హెడ్‌ మసాజ్‌ సహాయపడుతుంది. మంచి ఎసెన్షియల్ ఆయిల్స్‌తో రిలాక్సింగ్ స్కాల్ప్ మసాజ్ హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది, వాటికి పోషణనిస్తుంది, హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహిస్తుంది.

లావెండర్, రోజ్మేరీ, పిప్పరమెంట్‌ వంటి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను కొబ్బరి, బాదం, ఆలివ్‌ ఆయిల్‌లో మిక్స్‌ చేసి మృదువుగా మసాజ్‌ చేయాలి. తలస్నానం చేసే గంట ముందు ఇలా చేయాలి. తరచు ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. షాంపూలు, కండిషనర్లు, స్టైలింగ్ ఉత్పత్తుల వంటి రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల హెయిర్‌ ఫాల్‌ ఎక్కువ అవుతుంది. మీ జుట్టుకు హాని చేయని సల్ఫేట్‌ ఫ్రీ హెయిర్‌ ఉత్పత్తులను ఎంచుకోండి. స్ట్రెయిట్‌నర్‌లు, కర్లింగ్ ఐరన్‌ల వంటి హీట్ స్టైలింగ్ సాధనాలను తక్కువగా వాడాలి.

వీటి నుంచి వచ్చే వేడి జుట్టును బలహీన పరుస్తుంది. కలబంద గుజ్జులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది హెయిర్‌ ఫాల్‌ను కంట్రోల్‌ చేస్తుంది. తాజా కలబంద గుజ్జును తలకు పట్టించి 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి.. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. కలబంద స్కాల్ప్ pH ను సమతుల్యం చేస్తుంది, వాపును తగ్గిస్తుంది, హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహిస్తుంది.