Site icon HashtagU Telugu

Husband Wife: భర్త ఇంట్లో లేని సమయంలో భార్య చేయకూడని పనులు ఇవే..

When Wife Doesn't Love Husband Anymore

When Wife Doesn't Love Husband Anymore

Husband Wife: భార్యాభర్తలిద్దరూ అర్థం చేసుకుంటేనే కాపురం ఎన్ని రోజులైనా చక్కగా ఉంటుంది. అదే ఒకరినొకరిని అర్థం చేసుకోకుండా ఎవరి పని వాళ్లు చేసుకుంటే కాపురాలు ఎక్కువరోజులు నిలబడవు. ఇద్దరూ ఒకే మాటపై ఉండాలి. ఇద్దరి ఒకరినొకరి అభిప్రాయాలను గౌరవించుకోవాలి. తమ పార్ట్‌నర్‌లో నచ్చే గుణాలను మెచ్చుకుంటూ ఉండాలి. అలా ఉంటేనే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ, ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉంటే కష్టం అవుతుంది.

అయితే ఇటీవల చిన్న చిన్న కారణాలకే విడాకుల పేరుతో భార్యాభర్తలు విడిపోతున్నారు. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్నపాటి గొడవలు అనేవి కామన్. అలాంటి వాటిని భార్యాభర్తలు కూల్‌గా కూర్చోని పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న విషయాలే భార్యాభర్తల మధ్య గొడవకు కారణం అవుతాయి. దీంతో భర్త ఇంట్లో లేనప్పుడు భార్య ఎలాంటి పనులు చూయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

భర్త బయటకు వెళ్లిన తర్వాత భార్య ఫోన్లలో ఎక్కువ మాట్లాడటం లేదా చాటింగ్‌లో బిజీబిజీగా ఉండటం లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య పొరపచ్చాలకు దారి తీసే అవకాశముందని చెబుతున్నారు. ఇక భర్త ఇంట్లో లేని సమయంలో భార్య ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలవడం మంచిది కాదు. అబ్బాయిలను అసలు పిలవకూడదు. ఈ విషయం భర్తకు తెలిస్తే కాపురం చెల్లాచెదురు అయ్యే అవకాశం ఉంటుంది.

భర్త ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికొచ్చిన తర్వాత ఇష్టమైన వంటలు చేసి పెట్టాలి. మంచి రుచికరమైన ఆహారం వండి పెట్టాలి. అలాగే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భర్తతో గొడవ పడకూడదు. భర్త ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా జీవితంలో హాయిగా ఉండవచ్చని, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.