Relationship: ఈ కారణాలే భార్యభర్తల మధ్య చిచ్చుపెడతాయి…మీరు ఈ తప్పు చేయకండి..!!

ప్రేమ ఉన్నచోటే గొడవలు ఉంటాయన్న మాటా మీరు వినే ఉంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటాన్ని వివరించడానికి ఈ పదం వాడుతుంటారు.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 09:28 PM IST

ప్రేమ ఉన్నచోటే గొడవలు ఉంటాయన్న మాటా మీరు వినే ఉంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటాన్ని వివరించడానికి ఈ పదం వాడుతుంటారు. ముఖ్యంగా ప్రతిఒక్కరూ తమ భాగస్వామితో సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ కొంత మంది జంటలు ఏదోక విషయంపై నిత్యం గొడవపడుతూనే ఉంటారు. అయితే ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ..దాంపత్య జీవితంలో సంతోషాన్ని దూరం చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. చిన్న చిన్న విషయాలకు పట్టింపులకు వెళ్లకుండా ప్రశాంతంగా ఆలోచించినట్లయితే…ఆ సంసారం సంతోషంతో ముందుకు సాగుతుంది. అయితే కొంతమంది రిలేషన్ షిప్ లో వచ్చే గొడవలకు కారణం ఏంటో తెలుసుకుందాం.

విషయాలను అర్థం చేసుకోకపోవడం:
భాగస్వామి మాటలు ఒకరిమాటలు ఒకరికి అర్థంకాక తరచూ గొడవపడుతుంటారు. ఇద్దరు వ్యక్తులు ఏదైనా విషయంపై భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కానీ ఇతరుల అభిప్రాయాన్ని అణచివేయాలనుకోవడం తప్పు. అలాంటి పరిస్థితిలో, మీతో పాటు ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అర్థం చేసుకోవడమే కాకుండా ఇలా ఎందుకు చెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి.

అబద్ధం చెప్పడం:
అబద్ధాలు మిమ్మల్ని కొంతకాలం కాపాడుతాయి. కానీ ఏదొక రోజు నిజం బయటకు రాక మానదు. కొంతమంది దంపతులు తరచుగా అబద్దాలు చెబుతుంటారు. దీంతో కొంత కాలం పరిస్థితి వారి అదుపులోనే ఉన్నా, నిజానిజాలు తెలిశాక వారి జీవితంలో చాలా పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. మీరు ఎప్పుడూ మీ భాగస్వామికి ప్రతిదీ నిజాయితీగా చెప్పండి. అబద్ధాల వల్ల దంపతుల మధ్య నమ్మకం సన్నగిల్లుతుంది.

ప్రత్యేక అనుభూతి లేకపోవడం:
భాగస్వామి పుట్టినరోజు కానీ పెళ్లిరోజు కానీ ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి పరిస్థితిలో చాలా సార్లు పనిలో బిజీగా ఉండి మర్చిపోతుంటారు. విష్ చేయడం గుర్తుండదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు భార్యభర్తల మధ్య గ్యాప్ ను మరింత పెంచుతాయి. తాము వారికి ముఖ్యం కాదనే భావన వారిలో కలుగుతుంది. మీరు పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ…ప్రత్యేకమైన రోజుల్లో స్పెషల్ గా ప్లాన్ చేసుకోవడం మంచి అనుభూతిని ఇస్తుంది.

ఇతరులపై ఇంట్రెస్ట్ చూపించకూడదు:
ఇతరుల మీద కంటే మీ భాగస్వామికి ఎక్కువ ప్రాముక్యత ఇవ్వండి. భాగస్వామిని ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలి. అండగా ఉండాలి. లేదంటే ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. ఇది ఇద్దరి మధ్య గొడవలకు కారణం అవుతుంది.

అనుమానించడం :
భాగస్వామిని అనుమానించడం వల్ల రిలేషన్ షిప్ లో చీలికలు,గొడవలు వస్తుంటాయి. ఇలా కొన్ని కారణాల వల్ల దంపతుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కాబట్టి చిన్న చిన్న గొడవలు పెద్దవిగా చేసుకోకుండా..ప్రేమతో మసులకుంటే…ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంగా సుఖంగా సంతోషంగా ఉంటుంది.