Site icon HashtagU Telugu

Thyroid Diet : థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్ ఇవే.. ఇంతకీ ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటో తెలుసుకుందాం!

These are the foods that people with thyroid should not eat.. So, which foods should be avoided? Let's find out what the experts suggest!

These are the foods that people with thyroid should not eat.. So, which foods should be avoided? Let's find out what the experts suggest!

Thyroid Diet : ఇప్పటి జీవన శైలిలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య మరింతగా చోటుచేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో వైద్యులు సూచించే మందులు నిరంతరంగా వాడటం ఎంత ముఖ్యమో, సరైన ఆహార నియమాలు పాటించడం అంతకంటే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మందులు వాడుతున్నప్పటికీ కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే అవి హార్మోన్ శోషణకు అడ్డంకులు కలిగిస్తూ చికిత్స ఫలితాన్ని తగ్గించవచ్చు.

ఇంతకీ ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి? అవి తినడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి? చూద్దాం:

1. సోయా ఉత్పత్తులు

థైరాయిడ్ ఉన్నవారు సోయా మరియు దాని ఉత్పత్తులను పూర్తిగా నివారించాలి. ఇందులో ఐసోఫ్లేవోన్ అనే పదార్థం ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌ శోషణను అడ్డుకుంటుంది. అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ ప్రకారం అధిక సోయా వాడకం లెవోథైరాక్సిన్ మందు ప్రభావాన్ని తగ్గిస్తుంది  అని స్పష్టం చేసింది. కాబట్టి సోయా మిల్క్, టోఫు వంటి వాటిని పూర్తిగా తప్పించుకోవాలి.

2. క్రూసిఫెరస్ కూరగాయలు

క్యాబేజి, బ్రకోలి, కాలీఫ్లవర్, కాలే వంటివి క్రూసిఫెరస్ జాతికి చెందుతాయి. వీటిలో గైట్రోజెన్ అనే పదార్థం ఉంటుంది, ఇది శరీరంలో అయోడిన్ శోషణను అడ్డుకుంటుంది. అయోడిన్ లోపం థైరాయిడ్ ఫంక్షన్‌ను మరింత బలహీనపరుస్తుంది. ఈ కూరగాయలను పచ్చిగా కాకుండా ఉడికించి తినడం వల్ల గైట్రోజెనిక్ ప్రభావం తగ్గుతుంది.

3. గ్లూటెన్

గోధుమ, బార్లీ వంటి గ్లూటెన్ ఉన్న ఆహారాలను తగ్గించాలనేది నిపుణుల సూచన. కొన్ని అధ్యయనాల్లో గ్లూటెన్ ఫ్రీ డైట్ పాటించిన వారి థైరాయిడ్ హార్మోన్ స్థాయులు మెరుగయ్యాయని వెల్లడైంది. ముఖ్యంగా ఆటోఇమ్యూన్ థైరాయిడ్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

4. ప్రాసెస్డ్ ఫుడ్స్

ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో సోడియం అధికంగా ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్నవారిలో ఇది రక్తపోటును పెంచే ప్రమాదం ఉంది. అందుకే చిప్స్, ఫ్రోజన్ ఫుడ్స్, స్నాక్స్ వంటి పదార్థాలను నివారించాలి. బీపీ లాంటీ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తక్కువ ఉప్పుతో కూడిన ఇంటి ఆహారం తీసుకోవడం మంచిది.

5. స్వీట్స్

థైరాయిడ్ మెటబాలిజాన్ని మందగించడంతో, శరీరానికి అవసరమైన ఎనర్జీ నెమ్మదిగా విడుదలవుతుంది. ఈ పరిస్థితిలో అధిక చక్కెర తీసుకుంటే తేలికగా బరువు పెరుగుతారు. కాబట్టి మిఠాయిలు, చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్ వంటి వాటిని గరిష్టంగా తగ్గించాలి.

6. ఫ్యాటీ ఫుడ్స్

పచ్చి వెన్న, డీప్ ఫ్రైడ్ పదార్థాలు, రెడ్ మీట్ వంటి ఫ్యాటీ ఫుడ్స్‌ తినడం వల్ల థైరాయిడ్ మందుల ప్రభావం తగ్గుతుంది. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. థైరాయిడ్ సమస్యలతో పాటు గుండె సమస్యలు రావడానికి ఇదే కారణంగా మారుతుంది.

7. కెఫిన్

కాఫీ, టీ, శీతల పానీయాల్లో ఉండే కెఫిన్ కూడా థైరాయిడ్ మందుల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి మందు వేసుకున్న 30 నుండి 60 నిమిషాల వరకూ కెఫిన్ తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

8. టోఫు, పల్లీలు

ఇవి కూడా అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా టోఫు సోయా ఆధారిత ఉత్పత్తి కావడం వల్ల హార్మోన్ శోషణకు దోషకరం. కాగా, థైరాయిడ్ చికిత్సకు మందులతో పాటు ఆహార నియమాలు అనుసరించడం కీలకం. నిపుణుల సూచనల మేరకు పై సూచనల్ని పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రతి రోజు తీసుకునే ఆహారంపై జాగ్రత్తలు పాటిస్తే మందులు పనిచేసే విధానం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం – కాబట్టి ఆహారంలో మార్పులు అనివార్యం.

Read Also: TDP : టీడీపీ తరఫున సీఈసీకి 7 ముఖ్య సూచనలు..ఎస్‌ఐఆర్‌పై ఆందోళనలపై స్పష్టత కోరిన నేతలు