Foods: పెళ్లైన పురుషులు ఈ ఆహార పదార్థాలు కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకంటే ?

ప్రస్తుత రోజుల్లో చాలామంది పెళ్లయిన వారు సంతాన ఉత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా

  • Written By:
  • Publish Date - November 30, 2022 / 08:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది పెళ్లయిన వారు సంతాన ఉత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా పురుషుల్లో వయసు పెరిగే కొద్దీ సంతాన ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే పురుషులలో వీర్యకణాల నాణ్యత వయసుతో పాటుగా క్షీణించడం మొదలవుతుంది. కాబట్టి పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య రాకుండా ఉండాలి అంటే వారు ఆరోగ్యం పై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. మరి పురుషులు ఎటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి సమస్య తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సంతనోత్పత్తి సమస్యలు రాకుండా ఉండాలి అంతే ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి.

అలాంటి జంక్ ఫుడ్స్ కి బదులుగా పండ్లు కూరగాయలు తీసుకోవాలి. ఆహార పదార్థాల విషయానికి వస్తే.. ఆకుకూరలు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. మరి ముఖ్యంగా పురుషులు క్రమం తప్పకుండా ఆకుకూరలు తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి సమస్య మెరుగ్గా ఉంటుంది. ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియం టెస్టో స్టెరాన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. అలాగే బచ్చలి కూర తినడం వల్ల మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. బచ్చలి కూర కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే పురుషులలో సంతానోత్పత్తి సమస్యను దూరం చేస్తుంది. ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

ఉల్లిపాయ టెస్టోస్టెరాన్ ను పెంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి, ఉల్లిపాయల్లో డయలైల్ డైసల్ఫైడ్ అనే రసాయనం ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచే హార్మోన్ విడుదలను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా అల్లం పురుషుల సంతానోత్పత్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లం తినడం ద్వారా టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. అల్లంని నేరుగా తినడానికి ఇష్టపడని వారు టీ లరూపంలో కూడా తీసుకోవచ్చు