Food and Lazyness: మన రోజువారీ జీవనశైలిలో తినే ఆహారపు అలవాట్లు మన శారీరక, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలసట, బద్దకం, ఏ పనికైనా ఉత్సాహం లేకపోవడం వంటి లక్షణాలు ఒక్కోసారి మన ఆహార ఎంపికల ద్వారానే వచ్చి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు శరీరంలో ఎనర్జీ స్థాయిని తగ్గించి, బద్దకాన్ని పెంచుతాయని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.
బేకరీ పదార్థాలు – తాత్కాలిక శక్తి, దీర్ఘకాల బద్దకం
బ్రెడ్, కేక్, పఫ్ వంటి బేకరీ ఐటమ్స్‌లో అధికంగా ఉండే రిఫైన్‌డ్ కార్బోహైడ్రేట్లు, చక్కెర శరీరానికి తాత్కాలిక శక్తిని అందించినా, కొద్దిసేపటికే అలసటను కలిగిస్తాయి. ఇవి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపి మానసిక ఉత్సాహాన్ని తగ్గిస్తాయి.
అధిక కెఫిన్ సేవనం – నిద్రలేమి, అలసటకు దారితీస్తుంది
కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తాగడం తాత్కాలిక రిఫ్రెష్‌ను కలిగించినా, ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. మెటబాలిజం మందగించి శారీరకంగా అలసటకు గురికావచ్చు.
చెర్రీలు – సరిగ్గా తీసుకోకపోతే మత్తుకు కారణం
చెర్రీలు సహజంగా మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్‌ను ఉత్తేజింపజేస్తాయి. రాత్రి సమయంలో తీసుకుంటే మంచిదే కానీ, పనిదినాల్లో లేదా ఉదయాన్నే తీసుకుంటే బద్దకంగా మారవచ్చు.
ప్రాసెస్డ్ ఫుడ్స్ – జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం
పాస్తా, పిజ్జా వంటి ప్రాసెస్‌డ్ ఆహారాలు జీర్ణక్రియను మందగింపజేస్తాయి. ఇవి శరీరాన్ని నిస్సత్తువగా మార్చడమే కాకుండా, దీర్ఘకాలంలో హృదయ, శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉంది.
వేయించిన పదార్థాలు – తిన్న వెంటనే మత్తు, బద్దకం
నూనెలో బాగా వేయించిన ఆహారాలు తిన్న వెంటనే నిద్ర మత్తు కలిగించి శరీరాన్ని అలసటకు గురిచేస్తాయి. శక్తి తక్కువై, శారీరక చురుకుదనం తగ్గిపోతుంది.
సూచన:
శరీరం చురుకుగా ఉండాలంటే, మనం తీసుకునే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అధికంగా ప్రాసెస్‌డ్, షుగర్, కెఫిన్ ఉన్న పదార్థాలను తగ్గించి, సహజమైన పోషక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బద్దకాన్ని తగ్గించుకోవచ్చు.