5 Yoga Poses: కాళ్ళు, చేతుల్లో బలం కోసం 5 యోగాసనాలు!!

అయితే మీరు కొన్ని నిర్దిష్ట యోగాసనాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. గాయాలు అయ్యేందుకు తక్కువ ఛాన్స్..

  • Written By:
  • Publish Date - July 5, 2022 / 06:00 AM IST

కాళ్ళు, చేతులు, భుజాల్లో బలం మరింత పెరగాలా ?

ఫిట్ నెస్ లెవల్ ను పెంచుకోవాలని భావిస్తున్నారా ?

అయితే మీరు కొన్ని నిర్దిష్ట యోగాసనాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. గాయాలు అయ్యేందుకు తక్కువ ఛాన్స్.. కండరాల బలాన్ని పెంచేందుకు ఎక్కువ ఛాన్స్ ఉన్న కొన్ని యోగాసనాల గురించి తెలుసుకోవాలి. వీటిని రోజూ ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ఫిట్ నెస్ ను ప్రసాదించే ఆ 5 యోగాసనాల గురించి చెప్పింది ఎవరో మామూలు వ్యక్తి కాదు. మలైకా అరోరా లాంటి సెలిబ్రిటీలకు యోగా చిట్కాలు నేర్పించే సర్వేశ్ శశి. వివరాలు చూద్దాం..

1.భుజంగాసనం

వెన్నెముక గాయాలు, నడుము నొప్పి ఇతర వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్లు ప్రతి రోజూ వేయదగ్గ ఆసనం ఇది. వెన్నెముఖ ధృడత్వానికి, భుజాలు , ఛాతీలపై ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వేసినప్పుడు కడుపు కింది భాగం (పొత్తికడుపు)ను సాగదీయడం వల్ల నడుము భాగం నిటారుగా నిలపడానికి ఉపకరిస్తుంది.

2.అధోముఖ స్వానాసనం

ఈ ఆసనం చేసేటప్పుడు పాదాలు స్థిరంగా నేలకి ఆని ఉండాలి. వీపు పైకి ఉండాలి. చేతులు ముందుకు సాగి అర చేతులు నేల మీద ఉండాలి. మీ తల కిందకి ఉండాలి, మీరు లోపలికి చూస్తూ ఉండాలి. మూడూ, నాలుగూ సార్లు గాఢంగా గాలి పీల్చి వదలండి. ఈ యోగాసనం మీ మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. తద్వారా మీలో నెలకొన్న ఆందోళన, ఒత్తిడిని తగ్గించడం సహా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మంచి జీర్ణవ్యవస్థ జుట్టుకు మరింత పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.

3.అర్థ పించ మయూరాసనం

భుజాలను లూజ్ చేసి స్టిఫ్నెస్ తగ్గించడానికి ఇది చాలా మంచి ఆససం. ఈ ఆసనాన్ని ప్రతి రోజు సాధన చేస్తే భుజాలు మరియు కాళ్లతో పాటు కండరాలు కూడా బలపడతాయి. ఈ ఆసనం వేయడానికి ముందుగా ప్లాంక్ పోస్ లో ఉండాలి. ప్లాంక్ పోస్ లో ఉన్నప్పుడు చేతులు రెండు కలపము. కానీ అర్థ పించ మయూరాసనం లో రెండు చేతులను జోడించాలి.నడుము మరియు బట్ ను పైకి పెట్టి శ్వాస వదలాలి. ఇలా చేసినప్పుడు మోచేతులను నేలకు ఆన్చి ఉండాలి. ఈ విధంగా ముప్పై సెకండ్ల నుంచి ఒక నిమిషం వరకు ఉండవచ్చు. ఈ ఆసనం వేసినప్పుడు మోకాళ్లు తిన్నగా ఉండాలి. కొంచెం కూడా వంచకూడదు.పాదాలను మాత్రం నేలకు ఆన్చి ఉంచాలి.

4.పూర్వోత్తానాసనం

ముందుగా దండాసనంలో కూర్చోవాలి.రెండు కాళ్లను ముందుకు చాచి రెండు చేతులూ శరీరానికి ఇరుపక్కలా ఉంచుకోవాలి.నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నడుము భాగాన్ని పైకి లేపాలి. చేతులు నడుముకు ఆరు సెంటీమీటర్ల వెనక వైపునకు ఉంచాలి.అరచేతులు భుజాల కిందుగా ఉండేట్లు చూడాలి. పాదాలు సమాంతరంగా ఉండాలి. కాలి వేళ్లు భూమిని తాకేట్లుగా ప్రయత్నించాలి.

5.ధనురాసనము (విల్లు భంగిమ)

మనిషి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంచటంలో యోగాసనాలు ఎంతో దోహదపడతాయి. ముఖ్యంగా శరీరానికి శక్తి, బలాన్ని ఇవ్వటంతో పాటు అంతర్భాగాలు ఆరోగ్యంగా ఉండాలంటే ధనురాసనం ఎంతో ఉపయోగపడుతుంది. ధనురాసనం అనగా శరీరాన్ని ధనుస్సులాగా అంటే బాణంలాగా వంచాలి. అందుకే దీనికి ధనురాసనం అని పేరు వచ్చింది. ఈ ఆసనం ప్యాంక్రియాస్‌ను బలోపేతం చేయడమే కాకుండా నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి, ఈ భంగిమ మధుమేహం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అదనంగా, పొత్తికడుపు కండరాలను బలోపేతం చేయడం.. జీర్ణక్రియను ప్రోత్సహించడం, పొత్తికడుపు తిమ్మిరిని నివారించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.